చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక – బీజేపీ దురాక్రమణ – సుప్రీం తీర్పు

Chandigarh Mayor Election - BJP Aggression - Supreme Verdictచండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు పాతరేసి బీజేపీ తీవ్ర అక్రమాలు, మోసాలకు తెగబడింది. ఏకంగా బ్యాలెట్‌ పేపర్లనే ట్యాంపరింగ్‌ చేసి దొడ్డిదారిన తన అభ్యర్దిని మేయర్‌ పీఠానె క్కించింది. ఈ అప్రజాస్వామిక ఘాతుకానికి వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించి, సంచలనాత్మక తీర్పును వెలువరించింది. అక్రమంగా మేయర్‌ పదవినెక్కిన బీజేపీ నేత మనోజ్‌ సోంకార్‌ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. అసాధారణ పవర్‌ని వినియోగించి ఆమ్‌ ఆద్మీ – కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్ది అయిన కుల్దీప్‌ కుమార్‌ను మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించింది. దీంతో బీజేపీ ఖంగుతింది. దేశవ్యాప్తంగా ఈ తీర్పు పట్ల హర్షాతిరేకం వ్యక్తమౌతుండగా, రెండోవైపు ఈ ఎన్నికలో బీజేపీ బ్యాలెట్‌ల దురాక్రమణ త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు, దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదాన్ని తెలియ జేస్తున్నది.
జరిగిందేమిటంటే…వాస్తవంగా జనవరి 18న మేయర్‌ ఎన్నిక జరగాలి. రిటర్నింగ్‌ అధికారికి ఆరోగ్యం బాగోలేదనే కధ అల్లి ఫిబ్రవరి 6కి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు చండీగఢ్‌ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. ఆప్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లను కొను గోలు ప్రయత్నాలు విఫలమవడంతో బీజేపీ ఎన్నిక వాయిదా వేసింది. ఈ నేపధ్యంలో ఆప్‌ హైకోర్టును ఆశ్రయించగా జనవరి 30న మేయర్‌ ఎన్నిక జరపాలని అలాగే ఎన్నిక, కౌంటింగ్‌ ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు రికార్డు చేయాలని ఆదేశించింది.
జనవరి 30వ తేదీన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక జరిగింది. మేయర్‌ను, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవల్సి ఉంటుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీకి చెందిన చండీగఢ్‌ ఎంపి ఎక్స్‌ అఫి షియో సభ్యునిగా మొత్తం 36 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 13, బీజేపీకి 14, కాంగ్రెస్‌కి 7, అకాలీదళ్‌కు ఒకరు చొప్పున కౌన్సిలర్‌లు ఉన్నారు. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు, చండీగఢ్‌ ఎంపి, మద్దతు ఇస్తున్న అకాలీదళ్‌ కౌన్సిలర్‌తో కలిపి మొత్తం 16 మంది మద్దత్తు ఉండగా, ఆమ్‌ ఆద్మీ – కాంగ్రెస్‌ కూటమికి 20మంది బలం ఉంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా అనిల్‌ మసీV్‌ాను నియమించారు. ఈయన బీజేపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మరియు నామినేట్‌ చేయబడిన కౌన్సిలర్‌. వాస్తవంగా ప్రభుత్వ ఉన్నతా ధికారిని రిటర్నింగ్‌ అధికారిగా నియమిం చాలి. ఈ నిబంధనను కూడా బీజేపీ తుంగలో తొక్కింది. పార్టీ నాయకుడినే రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది.
బలం లేక పోయినా తప్పుడు పద్ధతులకు పాల్పడైనా గెల వాలని బీజేపీ ముందుగా వ్యూహం పన్నింది. మనోజ్‌ సోంకార్‌ ను మేయర్‌ అభ్యర్ధిగా నిలబెట్టింది. ఆమ్‌ఆద్మీ- కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్ధిగా కుల్డీప్‌ కుమార్‌ ఉన్నారు. 36 మంది ఓటు వినియో గించుకున్నారు. బీజేపీకి 16, ఆమ్‌ ఆద్మీ – కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్ధి కి 12 ఓట్లు వచ్చినట్లు, మిగిలిన 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ను మేయర్‌ అభ్యర్ధిగా గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. బ్యాలెట్‌ పేపర్లు ట్యాంపరింగ్‌ జరిగాయని ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను బహిష్కరించారు.
కౌంటింగ్‌లో రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న బీజేపీ నాయకుడు ఆమ్‌ ఆద్మీ – కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్ధికి అనుకూలంగా పడిన 8 బ్యాలెట్లు చెల్లకుండా వాటిపై గీత గీసి ఇంటు (ఞ) మార్క్‌ పెట్టాడు. రిటర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పేపర్‌లు ట్యాంప రింగ్‌కు పాల్పడుతున్న దశ్యాలు సిసిటీవి కెమేరాల్లో రికార్డ్‌ అయ్యింది. మున్సిపల్‌ అధికారులను లోబర్చుకున్నారు. ఈ అక్రమాలను ఆమ్‌ఆద్మీ పంజాబ్‌ – హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హై కోర్టులో ఛాలెంజ్‌ చేసింది. ఎన్నికపై స్టే కోరడమైంది. స్టే నిరాకరించి మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీస్‌ లు ఇచ్చింది. అంతేగాక బ్యాలెట్‌ పేపర్‌లను హై కోర్టు రిజిస్ట్రార్‌ స్వాధీనం చేసుకొని భద్రపరచాలని ఆదేశించింది.
హైకోర్టులో స్టే రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆప్‌ ఆశ్ర యించింది. సుప్రీంకోర్టు అత్యవసర కేసుగా దీనిని పరిగణించి వెంటనే విచారణ ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతత్వంలోని జస్టిస్‌ జెబి పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం మేయర్‌ ఎన్నిక కౌంటింగ్‌ వీడియోను కోర్టులోనే అందరి సమ క్షంలో ప్రద ర్శించింది. కౌంటింగ్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పేపర్‌లు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న దశ్యాలు చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఘాటుగా స్పందించింది. రిటర్నింగ్‌ అధికారిని బోనులో నిలబెట్టింది. తీవ్ర అక్రమాలకు, కోర్టులో సైతం అబద్ధా లకు పాల్పడిన నిన్నెందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రిటర్నింగ్‌ అధికారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ నోటీసు ఇవ్వాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
రిటర్నింగ్‌ అధికారిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిచడంతో తీర్పుకు రెండురోజులు ముందుగా మేయర్‌ పదవికి బీజేపీ రాజీనామా చేయించింది. మేయర్‌ ఎన్నికను రద్దుచేసి కొత్తగా ఎన్నిక జరపాలని సుప్రీం కోర్టు తీర్పిస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావించి వెంటనే తిరిగి ఎన్నిక పెడితే గెలవటా నికి గాను అవినీతి పద్ధతులకు తెరలేపింది. కోట్ల రూపాయలు ఎరేసి ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్లను కొనేసింది. కానీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ముఖ్యమైన అంశమేమంటే రాజ్యాంగంలోని సెక్షన్‌ 142 యొక్క అసాధారణ పవర్‌ను సుప్రీంకోర్టు ఉపయోగించింది. తిరిగి ఎన్నిక నిర్వహించకుండా ఆప్‌ అభ్యర్దిని మేయర్‌గా ప్రకటించింది. దీంతో బీజేపీ జిత్తుల మారి అడ్డదారులన్నీ మూసుకుపోయాయి. ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్లను కొనుగోలు చేసి ఎలాగైనా మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే అధికార దాహం పటాపంచలయ్యింది.
చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికకి చాలా రాజకీయ ప్రాముఖ్యత ఉంది. త్వరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి దేశంలోని బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలన్నీ ఇండియా బ్లాక్‌గా ఏర్పడిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ మేయర్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఆప్‌-కాంగ్రెస్‌ ఒక్కటై ఇండియా బ్లాక్‌గా మేయర్‌ అభ్యర్ధిని నిలబెట్టాయి. ఈ కూటమి గెలిస్తే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలపై పడుతుందని బీజేపీ భయం పట్టు కుంది. అందుకే ఈ దారుణానికి ఒడిగట్టింది. బీజేపీ అభ్యర్ధిని మేయర్‌గా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన వెంటనే బీజేపీ అధ్యక్షుడు జే.డి.నడ్డా అంకగణాంకాలు, కెమిస్ట్రీలు ఏవీకూడా బీజేపీ గెలుపును ఆపలేవని నిస్సిగ్గుగా ప్రకటించారు.
గతేడాది ఢిల్లీ మున్సిపల్‌ మేయర్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అనేక అక్రమాలకు పాల్పడింది. 250 స్థానాలున్న కార్పొరేషన్‌ లో ఆప్‌ 134 వార్డులలో గెలుపొందింది. బీజేపీ కేవలం 104, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలుపొందాయి. ఆప్‌ అభర్డి మేయర్‌గా గెలుపొందటానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అనేక నెలలు మేయర్‌ ఎన్నిక జరగనీయకుండా ఘర్షణలకు దిగింది. వందల కోట్లతో ఆప్‌ కార్పొరేటర్లను కొనుగోలు చేయటానికి ప్రయత్నిం చింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఉపయోగించింది. నిబంధనలకు విరుద్ధంగా పదిమంది బీజేపీ నాయకులను కో ఆఫ్షన్‌ సభ్యు లుగా నామినేట్‌ చేసి మేయర్‌ ఎన్నికల్లో వారికీ ఓటు హక్కు కల్పించారు. మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది. చివరికి ఆప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నామినేటెడ్‌ సభ్యులకు మేయర్‌ ఎన్నికలో ఓటు అర్హత లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ తోక ముడిచింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం సాధ్యం కాదనీ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ను ఏలాగైనా చేజిక్కించుకొని ఆప్‌ను ఇబ్బందులు పెట్టాలనే కుట్రపన్నింది. ఢిల్లీ మొత్తం మూడు ము న్సిపల్‌ కార్పొరేషన్లుగా వుండేది. మూడింటిని కలిపి ఒకే కార్పొ రేషన్‌గా బీజేపీ చేసింది. అయినా దాని కుట్రలు ఫలించలేదు.
సెల్‌ : 9490098792
– డాక్టర్‌ బి.గంగారావు

Spread the love