కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంలో కారులో ఇరుక్కుని చిన్నారి కల్నిష మృతి చెందింది. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లి పాప కారు ఎక్కింది. అయితే కారులో ఊపిరి ఆడకపోవడంతో చిన్నారి విగతజీవిగా మారింది. షాకింగ్ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love