ప‌రేడ్ గ్రౌండ్‌లో అమ‌ర జ‌వాన్ల‌కు సీఎం కేసీఆర్ నివాళి

నవతెలంగాణ – హైదరాబాద్
77వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్ చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా సంద‌ర్శ‌కుల రిజిస్ట‌ర్‌లో సీఎం కేసీఆర్ సంత‌కం చేశారు. మ‌రికాసేప‌ట్లో గోల్కొండ కోట‌పై కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు.

Spread the love