నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

cm revanth reddyనవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో జోష్ పెంచారు. ఓ వైపు సభలు నిర్వహిస్తూనే.. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఆ జిల్లాకు ఈరోజు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. మెదక్ కాంగ్రెస్ ఎంపీ నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. భారీ ర్యాలీగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా ర్యాలీలో, అలాగే రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు సీఎం దిశ నిర్దేశం చేయనున్నారు. తన ప్రసంగంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ నింపనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అభ్యర్థి నీలం మధు హాజరుకానున్నారు.

Spread the love