జలమండలి కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 పీఆర్సీ అమలు : సీఎం నిర్ణయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు (ఎచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌ బీ) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్‌ బోర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ సందర్భంగా.. తమ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు మెట్రో వాటర్‌ వర్క్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్‌, యూనియన్‌ నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Spread the love