నవతెలంగాణ – నవీపేట్: కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వారసత్వాన్ని కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి అన్నారు. మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరులో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్ననాటి నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదంపైన పోరాడే వారని చిన్న వయసులోనే జైలు జీవితం గడిపారని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా పేరుగాంచి1952లో ఎంపీగా గెలిచిన సైకిల్ పై వెళ్లే వారని అన్నారు . పశ్చిమబెంగాల్, త్రిపుర మరియు కేరళలలో సిపిఎం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన పాత్ర కీలకమైందని అన్నారు. ప్రస్తుత రాజకీయంలో తప్ప ప్రజాసేవ లేదని కాబట్టి ఆయన నేర్పిన బాటలో నడవాలని కోరారు. బిజెపి ఎంపీ భూషణ్ సింగ్ ను అరెస్టు చేసే మల్లయోధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సావిత్రి, సుశీల, సిఐటియు నాయకులు మేకల ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు కిషన్, దగడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.