బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌’గా మార్చుకోండి

– సింగరేణి జిఎం పర్సనల్‌ వెల్పేర్‌
జిఎం బసవయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌’ గా మార్చుకోవాలని, రూ.40 నుండి రూ.55 లక్షల ‘ఉచిత ప్రమాద బీమా సౌకర్యం’ పొందాలని సింగరేణి జిఎం పర్సనల్‌ వెల్పేర్‌ జిఎం బసవయ్య కోరారు. గురువారం సింగరేణి ప్రధాన కార్యలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాతీయ బ్యాంకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో ‘కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌’, ‘ప్రమాద బీమా స్కీమ్‌’ పై జిఎం పర్సనల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఆర్‌సి కె.బసవయ్య, జిఎం పర్సనల్‌ ఐఆర్‌పిఎం కుమార్‌ రెడ్డి, జిఎం ఫైనాన్స్‌ ఎం.సుబ్బారావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనియన్‌ బ్యాంకు జిఎంలు హరే కృష్ణ దాస్‌, పి.కృష్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ద్వారా సింగరేణిలో కార్మికులు, అధికారులందరూ తమ బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌’గా మార్చుకోవడం రూ.40 నుండి రూ.55 లక్షల ‘ప్రమాద బీమా స్కీమ్‌’ ప్రయోజనాలు పొందవచ్చని, ఈ స్కీమ్‌ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. అదనంగా రూ.30 లక్షల భీమా పొందడానికి సంవత్సరానికి రూ.313లు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. తద్వారా మొత్తం (55 నుండి30) రూ.85 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ సమీక్షలో సింగరేణి అధికారులు ఏజిఎం పర్సనల్‌ కవితా నాయుడు, డిజిఎం పర్సనల్‌లు కె.శ్రీనివాసరావు, జివి.కిరణ్‌ కుమార్‌, డిజిఎం ఎఫ్‌ అండ్‌ఏ కొమరయ్య, ఫైనాన్స్‌ మేనేజర్‌ పి.రాజేశ్వర్‌, పర్సనల్‌ మేనేజర్లు ఎస్‌వి రావు, ముకుంద సత్యనారాయణ, సీనియర్‌ పిఓ శివ కుమార్‌, యూనియన్‌ బ్యాంకు రీజినల్‌ హెడ్‌ హనుమంత రెడ్డి, చీఫ్‌ మేనేజర్‌ అమిత్‌ శర్మా, కొత్తగూడెం బ్రాంచ్‌ మేనేజర్‌ జి.కిషన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ కె. నవీన్‌, ఇతర అధికారులు సతీష్‌, కె. రమేష్‌, పి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love