సీపీఐ(ఎం) అభ్యర్థులు..

పాలేరు నియోజకవర్గం
పేరు : తమ్మినేని వీరభద్రం (69)
తల్లిదండ్రులు : కమలమ్మ-సుబ్బయ్య
పుట్టింది : తెల్దారుపల్లి గ్రామం, ఖమ్మం రూరల్‌ మండలం, ఖమ్మం జిల్లా.
రాజకీయ ప్రవేశం : 1971లో సీపీఐ(ఎం)లో చేరారు. ఖమ్మం డివిజన్‌, ఖమ్మం జిల్లా యువజనోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారు. 1985లో ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా, 1990లో జిల్లా తాత్కాలిక కార్యదర్శిగా, 1991లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 1996 వరకు పని చేశారు. తిరిగి 2001లో జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికయ్యారు. 1986లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1990 నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, 1999 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై కొనసాగుతున్నారు. 100 రోజులు 2,662 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం 2016 అక్టోబర్‌ 17నుంచి మహాజన పాదయాత్ర 2017 మార్చి వరకు సుమారు 5 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా 4,200 పైచిలుకు కి.మీ.లు పాదయాత్ర నిర్వహించారు.
ప్రజాప్రతినిధిగా అనుభవం : 1991లో మొదటిసారిగా ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమిచెందారు. 1996లో పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు.
ఖమ్మం నియోజకవర్గం
పేరు : యర్రా శ్రీకాంత్‌ (60)
తల్లిదండ్రులు : పుల్లయ్య
జన్మస్థలం : ఖమ్మం
నివాసం : శ్రీనివాసనగర్‌, ఖమ్మం 3 టౌన్‌
రాజకీయ ప్రస్థానం : 1980లో సీపీఐ(ఎం)లో చేరిక నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. పూర్తికాలం కార్యకర్తగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
ముషీరాబాద్‌ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : మద్దెల దశరథం (44)
పుట్టింది : వనపర్తి
తల్లిదండ్రులు : వెంకటయ్య- లక్ష్మి
కుటుంబ నేపథ్యం : వ్యవసాయ ఆధారిత కుటుంబం
నివాసం : గోల్కొండ చౌరస్తా, ముషీరాబాద్‌
రాజకీయ ప్రస్థానం : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల్లో చేశారు. 1998 నుంచి సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్త. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శివర్గ సభ్యులు, ముషీరాబాద్‌ నియోజవకవర్గం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
అభ్యర్థి పేరు : పగడాల యాదయ్య (55)
తల్లిదండ్రులు : పగడాల రాములు- వెంకటమ్మ
రాజకీయ ప్రస్థానం : సీపీఐ(ఎం)లో వివిధ హోదాల్లో పనిచేశారు. డీవైఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, వృత్తి సంఘాలు, జీఎంపీఎస్‌ సంఘంలో బాధ్యతలు చేపట్టారు. పీఏసీఎస్‌ చైర్మెన్‌గా, మంచాల ఎంపీపీగా, జెడ్పీటీసీగా, 2014, 2018లో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు.
భద్రాచలం
పేరు : కారం పుల్లయ్య (38)
చదువు : పదవ తరగతి
తల్లితండ్రులు :మహాలక్ష్మి, ముత్తయ్య
పుట్టిన స్థలం : మారాయి గూడెం, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి జిల్లా
పార్టీలో ప్రస్తుత బాధ్యతలు : సీపీఐ(ఎం) దుమ్ముగూడెం మండల కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శిగా చేస్తున్నారు.
వైరా అసెంబ్లీ నియోజకవర్గం
పేరు : భూక్యా వీరభద్రం (41)
తల్లిదండ్రులు : కమలమ్మ – సామ్యా నాయక్‌
జన్మస్థలం : కస్నాతండా, ఖమ్మం రూరల్‌ మండలం, ఖమ్మం జిల్లా
నివాసం : వైరా, సుందరయ్య నగర్‌ (వైరా నియోజకవర్గం)
రాజకీయ ప్రస్థానం : సీపీఐ(ఎం) పార్టీలో పూర్తికాలం కార్యకర్త, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. బంజారా పోరుబాట పాదయాత్రలో 60 రోజుల పాటు 500 తండాల్లో 1261 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు.
మధిర నియోజకవర్గం
పేరు : పాలడుగు భాస్కర్‌
తల్లిదండ్రులు : చిన్న వెంకయ్య, వెంకటమ్మ.
సొంతూరు : గార్ల, ఇల్లెందు నియోజకవర్గం
రాజకీయ ప్రస్థానం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాలేజీ సమయంలో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. గార్ల మండల ప్రజాశక్తి దినపత్రిక విలేఖరిగా పనిచేశారు. ఈ సమయంలోనే సీపీఐ(ఎం), సీఐటీయులో చురుకైన పాత్ర నిర్వహించారు. 1999లో గార్ల పిఏసిఎస్‌ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. కేవీపీఎస్‌ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీకి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.
అశ్వరావుపేట
పేరు : పిట్టల అర్జున్‌ (48)
తండ్రి : నాగులు
గ్రామం : సీతమ్మ
రాజకీయ ప్రస్థానం : 1994లో విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశారు. 2021 నుంచి 2011 వరకు సీపీఐ(ఎం) దమ్మపేట మండల కార్యదర్శిగా పని చేశారు.
సత్తుపల్లి
పేరు : మాచర్ల భారతి (60)
తల్లిదండ్రులు : మన్యం దేవానందం – నాగరత్నం
జన్మస్థలం : గార్ల,మహబూబాబాద్‌ జిల్లా
నివాసం : ఖమ్మం
రాజకీయ ప్రస్థానం : సీపీఐ(ఎం)లో పూర్తికాలం కార్యకర్త, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు
జనగామ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : మోకు కనకా రెడ్డి (49)
తండ్రి : యాదవరెడ్డి
పుట్టిన ఊరు : నాగపురి, చేర్యాల మండలం
రాజకీయ ప్రస్థానం :ఎస్‌ఎఫ్‌ఐ జనగామ డివిజన్‌ కార్యదర్శిగా, డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ, రైతు సంఘంలో చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : జాలకంటి రంగారెడ్డి (68)
తల్లిదండ్రులు : జూలకంటి కాశిరెడ్డి, లక్ష్మమ్మ
పుట్టిన ఊరు : కొత్తగూడెం, తిప్పర్తి మండలం
ప్రజా ప్రాతినిధ్యం : 1987 నుంచి 1992 వరకు మిర్యాలగూడ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌, 1994, 2004, 2009 మూడు పర్యాయాలు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా..
పార్టీలో ప్రాతినిధ్యం : 1978లో సీపీఐ(ఎం)లో చేరిక. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడుగా, సీఐటీయూ జిల్లా అధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, ప్రస్తుతం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
నకిరేకల్‌ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : బొజ్జ చినవెంకులు (55)
తల్లిదండ్రులు : బొజ్జ రామచంద్రయ్య, మరియమ్మ
కుటుంబం : వ్యవసాయ కుటుంబం, కేతపల్లి మండలం, ఇనుపాముల గ్రామం,
రాజకీయ ప్రస్థానం : ఎస్‌ఎఫ్‌ఐ, రైతు సంఘం, వ్యవసాయకార్మిక సంఘం నేతగా పనిచేశారు. ఇనుపాముల గ్రామ సర్పంచ్‌గా, పీఏసీఎస్‌ చైర్మెన్‌గా, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నారు.
భువనగిరి నియోజకవర్గం
అభ్యర్థి పేరు : కొండమడుగు నర్సింహ (48)
తల్లిదండ్రులు : కొండమడుగు సాయమ్మ, బాలయ్య.
గ్రామం : ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.
రాజకీయ ప్రస్థానం : ఎస్‌ఎఫ్‌ఐలో వివిధ కమిటీల్లో పని చేశారు. ప్రజానాట్యమండలి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, 2018లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా ఉన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గం
అభ్యర్థి పేరు : జొన్నలగడ్డ మల్లికార్జున్‌ (59)
తల్లిదండ్రులు : జొన్నలగడ్డ కనకదుర్గమ్మ- సత్యనారాయణ
వృత్తి :1985 నుంచి (విడియ పరిశ్రమల) ఇప్పటి శాండివిక్‌ పరిశ్రమలో కార్మికుడిగా, 1989 నుంచి ఆల్విన్‌ వాచ్‌ పరిశ్రమలో కార్మికుడిగా 2000 వరకు పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.
రాజకీయ నేపథ్యం : 1979లో విద్యార్థి సంఘం నాయకుడిగా చేశారు. 2000 నుంచి సీపీఐ(ఎం) పూర్తి కాలం కార్యకర్తగా పని ప్రారంభం.. సీఐటీయూ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పటాన్‌ చెరువు పారిశ్రామిక ప్రాంతంలోని పాశం మైలారం, పటాన్‌చెరువు, రామచంద్రపురం, బొల్లారం తదితర పరిశ్రమల్లో కార్మిక సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

Spread the love