మహిళ రెజ్లర్లకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) అందోళన

నవతెలంగాణ-గార్ల: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళ రెజ్లర్లకు న్యాయం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ డిమాండ్‌ చేశారు.రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కమిటీ అధ్వర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్ లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత గా ఉండాల్సిన ఎంపి క్రీడలలో దేశం తరపున ఆడుతున్న రెజ్లర్లపై లైంగిక వేధింపుల కు పాల్పడటం సిగ్గు మాలిన చర్య అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై హింస, దాడులు, లైంగిక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు.మహిళ రక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని విమర్శించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కు పాల్పడిన ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. వేధింపులకు గురై న్యాయం కోసం అందోళన చేస్తున్న మహిళ రెజ్లర్లకు దేశం మొత్తం అండగా నిలవాలని కోరారు. ఈ రాస్తారోకో లో నాయకులు అంబటి వీరస్వామి,బి. అప్పిరెడ్డి, మౌలాన మేస్త్రి, రేఖం శ్రీనివాస్, జడ శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది నరేష్, రాజు, కోటయ్య, బిక్షం, అంజయ్య ,శ్యామ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love