జన సంద్రం

ఈ రోజు
నగరం జనసంద్రం
సాగే కన్నీటి ప్రవాహం
ఏ ఎండా వాన ఆపలేదు
అంతిమయాత్ర సాగిపోతూనే వుంది
హోరెత్తిన నినాదాలు
అలుపులేని ఆటలుఈ రోజు
నగరం జనసంద్రం
సాగే కన్నీటి ప్రవాహం
ఏ ఎండా వాన ఆపలేదు
అంతిమయాత్ర సాగిపోతూనే వుంది
హోరెత్తిన నినాదాలు
అలుపులేని ఆటలు
అలసిపోని పాటలు
ఆ అభిమానాన్ని
ఎలా కొలువగలం?
ఆ ఆత్మీయతని
ఎలా ఆపగలం?
ఎవరూ ఆడిగింది కాదు
ఎవరూ రమ్మని కోరింది లేదు.
అతని లక్ష్యం
ప్రజలకు చేరువయింది
అతని మార్గం
ప్రజలను ఏకం చేసింది
పాట ఆయుధమయింది
ఆట తోడయింది.
ఇది ఒకనాటి ముచ్చట కాదు
దశాబ్దాలుగా కష్టాల కొలిమిలో
కరిగిపోవడం
ఉద్యమాలే ఊపిరిగా
సాగిపోవడం
తూటాలను ఎదిరించి
ఆ తూటానే తన
శరీరంలో దాచుకుని
నిష్క్రమించడం
మరణం కాదు చివరి చరణం
అది అభిమాన జనాల హృదయ
భాండాగారం.
– తుర్లపాటి లక్ష్మి, 9704225469

Spread the love