ప్రియమైన ప్రియ..

గోల్డెన్‌ గ్లోరి బ్యానర్‌ పై అశోక్‌ కుమార్‌, లీషా ఎక్లెయిర్స్‌ జంటగా ఏజె.సుజిత్‌ దర్శకత్వం వహించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రియమైన ప్రియ’. ఏజె. సుజిత్‌, ఎ.బాబు నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియో రిలీజ్‌ వేడుక ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్‌ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. ఈ వేడుకకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ బసి రెడ్డి, నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యదగిరి,
ప్రొడ్యూసర్‌
ఎంఆర్‌ చౌదరి వడ్లపట్ల ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. సి.హెచ్‌. సీతారామ్‌ యాదవ్‌ నిర్మాణ నిర్వాహణలో రూపొందిన ఈ చిత్రాన్ని మన స్క్రీన్‌ మ్యాక్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా థియేటర్‌లలో రిలీజ్‌ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా హీరో అశోక్‌ మాట్లాడుతూ, ‘ఇదొక మంచి సైకో థ్రిల్లర్‌. ఇందులో హీరో నేనే, సైకో నేనే’ అని తెలిపారు. ‘ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది’ అని హీరోయిన్‌ లీషా అన్నారు.

Spread the love