మోసం చేసే ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ-మట్టెవాడ
విద్యార్థులను, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే విధంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫ్లెక్సీలను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ వరంగల్‌ జిల్లాఅధ్యక్షుడు చుక్క ప్రశాంత్‌ అధికార యంత్రాంగాన్ని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ నగరమంతా అసత్య ప్రచారంతో హోర్డింగులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కార్పోరేట్‌ ప్రైవేటు విద్యాసంస్థల ఫ్లెక్సీలు తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్‌ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమా న్ని రంగసాయిపేటలో చే పట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రై వేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు కాన్వాసింగ్‌ పేరుతో గ్రామాల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు కాన్వాసింగ్‌ చేస్తున్నారనీ అమాయ కులైన తల్లిదండ్రులను విద్యార్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బూటకపు మాటలతో ప్రలోభాలకు గురి చేస్తూ లక్షల్లో ఫీజులు గుంజాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్‌ ప్రైవేటు విద్యాసంస్థలు లేని వాటిని ఉన్నట్టు క్రియేట్‌ చేస్తూ కొన్ని పాఠశాలకు అనుమతులు లేకుండా నడుపుతూ ఐఐటి మెడికల్‌ ఫౌండేషన్‌ పేరు మీద క్లాసులు నిర్వహిస్తున్నామని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అసత్య ప్రచారాలతో ఇష్టానుసారంగా గ్రామాల్లో పట్టణమంతా ఫ్లెక్సీలతో ప్రచారాన్ని విస్తరిస్తున్నారనీ అన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు యాజమాన్యాలు వరంగల్‌ జిల్లాలోని పేద మధ్య తరగతి వారికి ఇంగ్లీష్‌ బోధన స్మార్ట్‌ క్లాసులని ఆశచూపి తమ విద్యాసంస్థలు మెరు గైన విద్యను అందిస్తున్నామని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారనీ ఫీజుల నియంత్రణ చట్టం గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని జలగల పట్టిపీడిస్తున్నారనీ అన్నారు. 2009 విద్య హక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని ప్రైవేట్‌ కార్పొరేటర్‌ స్కూళ్లకు సూచించిన కూడా విద్యా హక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదన్నారన్నా రు. మండల విద్యాశాఖ అధికారులు వెంటనే స్పం దించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్‌, సో హెబ్‌, మామూన్‌, శానవన్‌, రామ్‌, సురేష్‌, అర్జున్‌, రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love