దేఖో ముంబై.. దోస్తీ మజా

Dekho Mumbai.. Dosti Majaనిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్‌ లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాత. తాజాగా ఈ చిత్రం నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్‌ వీడియోను హీరో రవితేజ రిలీజ్‌ చేసి, పాట బాగుందని చిత్ర బందాన్ని ప్రశంసించారు. ‘ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్‌గా ఉంది. అమ్రిష్‌ గణేష్‌ అందించిన సంగీతం ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌, మేఫ్‌ు-ఉ-వాట్‌ సాహిత్యం అందించారు. ”దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్‌ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా అద్నాన్‌ సమీ, పాయల్‌ దేవ్‌ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. అలాగే శిరీష్‌ నత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్‌తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ నాయకానాయికలు వేసిన స్టెప్పులు అలరించాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 6న విడుదల చేయనున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love