హైదరాబాద్: ఆహారోత్పత్తుల కంపెనీ వీక్‌ఫీల్డ్ ఫుడ్స్ కొత్తగా ఇన్‌స్టంట్ కస్టర్డ్ మిక్స్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. రెండు నిమిషాల్లో ఈ డెజర్ట్ రెడీ అవుతుందని పేర్కొంది. ఆరు దశాబ్దాలుగా డెజర్ట్ మిక్స్‌ల విభాగంలో ఆధిపత్యం కలిగి ఉన్నామని వీక్‌ఫీల్డ్ ఫుడ్స్ సిఇఒ సచ్‌దేవా పేర్కొన్నారు. నూతన ఇన్‌స్టంట్ కస్టర్డ్ మిక్స్ 2 నిమిషాల్లో గొప్ప రుచిని అందిస్తుందన్నారు. ఒక్క సాచెట్ ధర రూ.25గా నిర్ణయించామన్నారు.