Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలి

అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలి

- Advertisement -

క్యూర్ ప‌రిధిలో అర్బన్ హౌసింగ్ కు ప్రాధాన్య‌త
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచాల‌నీ , ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క్యూర్ ప‌రిధిలో అఫ‌ర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బ‌న్ హౌసింగ్ స్కీమ్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణంపై శ‌నివారం హైదరాబాద్‌‌లోని స‌చివాలయంలో మంత్రి స‌మీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌న్న సంక‌ల్పంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకం విజ‌య‌వంత‌మైందని చెప్పారు. ఇది దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందని తెలిపారు. క్యూర్ ప‌రిధిలో చేప‌ట్ట‌బోయే అఫ‌ర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బ‌న్ హౌసింగ్ లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఆ ప‌రిధిలో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా ఇండ్లు నిర్మించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల మేర‌కు రెవెన్యూ , హౌసింగ్ విభాగాల అధికారులు స‌మిష్టిగా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని సూచించారు. స్ధానిక ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే ఖ‌రారైన స్ధ‌లాల్లో పొజిష‌న్ తీసుకుని ఇండ్ల నిర్మాణాల‌కు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. క్యూర్ ప‌రిధిలోని 26 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో తొలి విడ‌త‌లో 500 ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అతి త్వరలో టెండ‌ర్ల‌ను ఖ‌రారు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌ది ఆర్డీవో, 107 త‌హ‌శీల్దార్, స్టాంప్స్, రిజిస్ట్రేష‌న్‌కు రెండు, నాలుగు జిల్లాల్లో స‌బ్ రిజిస్ట్రార్, 52 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ భవ‌నాల‌న్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయని తెలిపారు. స‌మావేశంలో హౌసింగ్ కార్య‌ద‌ర్శి వి.పి. గౌత‌మ్‌, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేష‌న్ ఐజీ రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -