Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిని

తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిని

- Advertisement -

ఎక్స్‌లో 20 ఏండ్ల రాజకీయ
ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. తన 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానంపై శనివారంనాడాయన భావోద్వేగ పోస్ట్‌ ‌పెట్టారు. ఈ 20 ఏండ్లలో ఎన్నో విజయాలు, మరెన్నో సవాళ్లు, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన అనుబంధం ప్రజలతోనే కొనసాగిందని రాసుకొచ్చారు. మిడ్జిల్‌లో సాధారణ రాజకీయ కార్యకర్త గా ప్రారంభమైన తన ప్రయాణం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజల గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే స్థాయికి చేరడం వెనుక ప్రజల విశ్వాసమే కారణమని పేర్కొన్నారు. ‘‘లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలతో చెప్పినా… ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకం. ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో నాతో కలిసి నడిచిన ప్రజలు, కార్యకర్తలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతాను. ముఖ్యమంత్రిగానే కాకుండా ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికే ప్రయత్నిస్తానని ఆ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -