తాడిచెర్ల పిఏసిఎస్ వైస్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం..

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావుపై బొమ్మ రమేష్ రెడ్డి తోపాటు కొందరు డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు జిల్లా అధికారి శైలజ పేర్కొన్నారు.గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశానికి అవిశ్వాస నోటీసు ఇచ్చిన సభ్యులు గైర్హాజర్ కావడంతో ప్రస్తుత వైస్ చైర్మన్ ప్రకాష్ రావు  వైస్ చైర్మన్ గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లుగా డిసిఓ ప్రకటించారు.
Spread the love