ఐఆర్ సీఎస్ ఆద్వర్యంలో బాదీతులకు నిత్యవసరవస్తువులు అందవేత..

నవతెలంగాణ – జుక్కల్
ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో ఖండేబల్లూరు గ్రామంలో ఔట్టి శాంతాబాయి మారుతి కుటుంబముH-No 1-73నివసిస్తున్న గుడిసె రాత్రి ఆదివారం 10:30 గంటలకి అగ్ని ప్రమాదానికి గురై  వంట సామాగ్రి బట్టలు మొత్తం కాలిపోవడం జరిగింది అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు నలుగురు పిల్లలు తల్లి గుడిసెలో పడుకుని ఉన్నారు తండ్రి కెనాల్ వాటర్ పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళాడు ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది ఆ మంటలు యొక్క వేడిని చూసి పిల్లవాడు నిద్రలేచి అరుపులు మొదలు పెట్టేసరికి చుట్టుపక్కల వారు చుట్టూ ఉన్నటువంటి తుంగ కట్టెలను జరిపేసి వాళ్ళని బ్రతికించి కాపాడారు. గురువారం నాడు ఐ ఆర్ సి ఎస్ తరఫున వారి కుటుంబానికి  కిచెన్ సామాగ్రి దుప్పటి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దస్థిరాం సార్. రెడ్ క్రాస్ చైర్మన్ డోంగ్లే  ఉమాకాంత్, చంద్రకాంత్ సెట్, సాయినాథ్, పండరి, వెంకట్ గౌడ్ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love