– సకాలంలో రుణాలివ్వాలి : బ్యాంకులకు వ్యవసాయశాఖ ఆదేశాలుొ త్వరలోనే రుణమాఫీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు బంధు నిధులను అప్పు కింద జమచేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా బ్యాంకులను కోరింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. హోల్డ్‌లో పెట్టిన 20లక్షల రైతుల అకౌంట్లకు సంబంధించిన సమాచారం తమ దృష్టికి రాలేదని, అయినా రుణాలు ఇవ్వాలని, రెన్యూవల్ చేయాలని రైతు బంధు నిధులను అప్పు కింద జమచేయొద్దు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అన్ని బ్యాంకులను కోరినట్టు తెలిపింది. జీఓ నెంబర్ 148 ప్రకారం రుణమాఫీ నిధులను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. రుణమాఫీ 2018, 2020సంత్సరాల్లో అమలుకే జారీచేసినట్టు తెలిపింది. ఇప్పటి వరకు రూ.1207.37కోట్ల 5,42,635 మంది రైతులకు పంపిణీ చేశామని వెల్లడించింది. జీఓ నెం.148 ప్రకారం 11డిసెంబర్2018 నాటికి పంట రుణ బకాయిలు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులని, వారికి వడ్డీ, అసలు మొత్తం లక్షరూపాయల వరకు మాఫీ చేయనున్నట్టు తెలిపింది. రుణ నిబంధనల ప్రకారం ప్రతి రైతూ సంవత్సర కాలంలో పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు చెప్పింది. ప్రతి బ్యాంకు సకాలంలో రుణాలు మంజూరు చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండాలని ఎస్‌ఎల్‌బీసీని కోరినట్టు వ్యవసాయ శాఖ వివరించింది.