ప్రపంచ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం అవసరం

కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరోగ్యపరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం అవసరమని కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రి భగవంత్‌ ఖుబా తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మూడవ జీ 20 ఇండియా హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. పరిశోధన – అభివద్ధి భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, వాటాదారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. అప్పుడే వనరుల కేటాయింపు సులభమవుతుందని చెప్పారు. నిధులు, వైద్య సర ఫరాలు, సిబ్బంది, సమాచారం వంటి వనరులను ప్రభావవంతంగా, సమర్థవం తంగా పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో నిటిఅయోగ్‌ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్‌ వి.కె.పాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ కార్య దర్శి, ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీఈవో జి.కమల వర్ధనరావు, కేంద్ర ఆరోగ్య, కుటు ంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love