లైకా ప్రొడక్షన్స్‌ కార్యాలయల్లో ఈడీ సోదాలు

నవతెలంగాణ – చెన్నై: ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. చెన్నై లోని లైకా కార్యాలయం సహా ఆ సంస్థకు చెందిన మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఓ కేసులో ఈడీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల నుంచి లైకా సంస్థ ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

Spread the love