సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్). రామ్‌యోగి వెలగపూడి దర్శక, నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్‌కి వెళ్ళనుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రామ్‌యోగి మాట్లాడుతూ, ‘ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ జోనర్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఆర్టిస్ట్‌లందరూ చక్కగా సహకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లనుంది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం. దర్శక,నిర్మాతగా చేస్తున్న నా తొలి ప్రయత్నమిది. అందరి ఆదరణ కావాలని కోరుతున్నా. ఈసినిమా కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటర్: విజరు, ఆర్ట్: యోగి వెలగపూడి, కొరియోగ్రాఫర్: జిన్నా, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి.