రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌

– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకరపల్లి
రైతులకు ఎన్నో పథకాలు ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బాంధవుడు అయ్యాడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రైతు దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగపూర్‌ రైతు వేదిక క్లస్టర్‌, పర్వేద క్లస్టర్‌ పాల్గొన్నారు. అంతకుముందు రైతులందరూ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక ఎటువంటి మార్పులు జరిగాయని వివరించారు. నీటిపారుదల రంగంలో, విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాల కారణంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, పంజాబ్‌కు ధీటుగా నేడు తెలంగాణలో వరి సాగు జరుగుతుందని తెలిపారు. రైతు వేదికలు నిర్మించి రైతులకు మార్కెట్‌ లో పంట డిమాండ్‌, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటి పై సంబంధిత అధికారులతో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసరాతో మొదలైన ధీమా రైతు బంధుని కలుపుకుని దళిత బంధుతో బతుకు చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపిటిసిలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love