రైతులు నకిలీవిత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నవతెలంగాణ-అడ్డగూడూరు
రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని, విత్తనాల కొనుగోలులో మోసపోవద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్‌ మందులు సామేలు కోరారు.తన నివాసం ధర్మారం గ్రామంలో రైతులతో విలేకర్లతో మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ కల్తీవిత్తనాలు అమ్మే వారిపై కఠినచర్యలకు ఆదేశించారన్నారు. రైతులు నమ్మకమైన దుకాణంలో బిల్లు తీసుకుని విత్తనాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిని గుర్తించి అగ్రికల్చర్‌ అధికారులకు ఫిర్యాదుచేయాలన్నారు.విత్తనంలో మోసపోతే ఆరుగాలం శ్రమ పెట్టుబడి వృథాకావడంతో పాటు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రాకుండా రైతులు నకిలీ విత్తనాలపై దృష్టి సారించి,బిల్లులు లేకుండా ఆంద్ర రాయలసీమ నుండి వచ్చి ఇక్కడ ఏజంట్లను పెట్టుకుని అమ్మే విత్తనాలను కొనుగోలు చేయొద్దన్నారు.ధాన్యం కొనుగోలుకేంద్రాలలో ధాన్యం రాసులు ఇంకా 50 శాతం పైగా ఉన్నాయన్నారు.లారీల కొరతతో గొనుగోలు జాప్యం జరుగుతుందన్నారు.రోజు పనిలేక బీహార్‌ హమాలీలు వెల్లిపోయారని, రైతులు తడిసిన ధాన్యం ఆరబెట్టి తూర్పారాబట్టాక మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, తరుగు తీస్తున్నారన్నారు.లారీల వారు అదనంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. ఈసమస్యను డీఎం గోపి దృష్టికి తీసుకెళ్లారు.అలాగే మండలపరిధిలో చౌళ్లరామారం గ్రామంలో 15 వేల మెట్రీక్‌ టన్నుల గోదాంను సుమారు రూ.20 కోట్లతో ప్రారంభించినా వినియోగంలోకి తేలేదన్నారు.ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఆనిర్ణయాలు అమలుపర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారిపై ఆగ్రహించారు.ఈ కార్యక్రమంలో రైతులు కప్పలవెంకన్న, సందా అంజయ్య, కప్పల ముత్తయ్య, మేకల పద్మారావు, లాదినేని నాగయ్య, కప్పల ముత్తయ్య, శీలం ముత్తయ్య, శీలం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love