క్షేత్ర పరిశీలనే ఉత్తమ అధ్యయనం

– మురళి వర్దేల్లి
నవ తెలంగాణ-మెదక్‌ టౌన్‌
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్‌, వక్ష శాస్త్ర విభాగము ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు హెర్బెరియం తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొక్కల భాగాలను సేకరించి వాటిలోని తేమను తొలగించి ఎండిన తర్వాత సూక్ష్మజీవ రహితం చేసి, వివరాలతో పొందుపరిచి, భద్రపరిచే విధానాన్ని హెర్బేరియం అంటారని, హెర్బెరియం పరిశోధన కొరకే కాగా మొక్క పుష్పించే కాలం లభించే ప్రదేశంను, మొక్క వర్గీకరణతో పాటు శాఖీయ నిర్మాణము, ప్రత్యుత్పత్తి నిర్మాణాలు వాటి లక్షణాల గురించి అధ్యయనము చేయుటకు వీలవుతుందని కార్యక్రమం కన్వినర్‌ మురళి వర్దేల్లి తెలియజేసారు. అంతరం విద్యార్ధులను కళాశాల ప్రాంగణంలో క్షేత్ర స్థాయిలో మొక్కల జాతుల గుర్తింపు, మొక్కల సేకరణ చేయించి హేర్బెరియం కొరకు వాటిని నిలువచేయు విధానంపై హస్తకత్యరూపం ద్వారా అధ్యయనం చేయించారు. ఈ కార్యక్రమంలో వక్షశాస్త్ర విభాగాధిపతి డా.దినకర్‌, ఉపన్యాసకులు డా.బి.రాజు, ల్యాబ్‌ ఇంచార్జ్‌ సుధారాణి, విద్యార్ధిని, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love