అంచనాలు అందుకునేలా సినిమాలు చేస్తా…

శ్రీకాంత్‌, ఊహల నట వారసుడిగా అరంగేట్రం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రోషన్‌ మేకా. బాలనటుడిగాహొ’రుద్రమదేవి’హొ(2015) చిత్రంలో తెరపై మెరిశాడు. తర్వాత హీరోగా పరిచయం అవుతూ నటించిన ‘నిర్మలా కాన్వెంట్‌’హొ(2016) చిత్రానికి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సొంతం చేసుకున్నాడు. కెరీర్‌ ప్రారంభంలోనే దర్శకేంద్రుడు కె.రాఘ వేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళి సందడి’ చిత్రంలో నటించడం విశేషం. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా రోషన్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ‘పెళ్లి సందడి’ విజయం తర్వాత రోషన్‌ చేస్తున్న కొత్త సినిమాపై అందరిలోనూ అంచనాలు భారీగా పెరిగాయి. ఈ యువ హీరో ప్రస్తుతం వైజయంతీ మూవీస్‌, వేదాంస్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌లో తన తదుపరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. నేడు (సోమవారం) రోషన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఆయన మాట్లాడుతూ, ‘కెరీర్‌ ప్రారంభంలోనే రాఘవేంద్రరావులాంటి దర్శక దిగ్గజం నిర్మించిన సినిమాలో నటించటం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్‌’తో నాకు మంచి ఎంట్రీ లభించడం విశేషంగా భావిస్తున్నాను. మంచి సినిమాలతో, మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని చెప్పారు.

Spread the love