నల్లని నిగనిగలాడే ఆరోగ్యవంతమైన జుట్టు కోసం

జుట్టు నల్లగా, లావుగా, దఢంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, షాంపూలు, సీరమ్‌, మాయిశ్చరైజర్లు ఇలా చాలా రకాల క్రీములు వాడుతుంటారు. అయినా మంచి జుట్టు సొంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. జుట్టు ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్‌ ఐరన్‌ లు, హెయిర్‌ డ్రైయర్‌ లు వంటి హాట్‌ స్టైలింగ్‌ టూల్స్‌ ఉపయోగించడం వల్ల జుట్టు పాడైపోతుంది. హెయిర్‌ డైస్‌, కెరాటిన్‌ హెయిర్‌ బోటాక్స్‌ లాంటి మొదలైన రసాయన చికిత్సలు జుట్టును బలహీనపరుస్తాయి. ఇలాంటివన్నీ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. రకరకాల హెయిర్‌ స్టైల్‌ వేసుకోవాలన్న కోరిక చాలా మందికి కలుగుతుంది. అయితే అలా జుట్టును టైట్‌ చేసే స్టైల్స్‌ వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. గట్టిగా లాగి కట్టే హెయిర్‌ స్టైల్స్‌ వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఎప్పటికప్పుడు చిట్టిపోయిన చివరి జుట్టును కట్‌ చేసుకోవాలి. జుట్టుకు సరిపడని హెయిర్‌ ప్రొడక్ట్‌ లను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారుతుంది. జుట్టును అతిగా దువ్వడం వల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే జుట్టు చిట్లిపోతుంది.

Spread the love