గురుకులం ఉపాధ్యాయుల పరీక్ష కోసం ఉచిత కోచింగ్

నవతెలంగాణ కంటేశ్వర్
ఉమ్మడి నిజామాబాదు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ,ఎస్టీ & ఈ.బిసి నిరుద్యోగ అభ్యర్థులకు గురుకులం ఉపాధ్యాయుల పరీక్షకు బి.సి.స్టడీ సర్కిల్ నిజామాబాదు నందు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ బిసి స్టడీ సర్కిల్ తరఫున రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో www.tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా 28-05-2023 వ తేదీ లోపు అప్లై చేసుకోగలరు. అభ్యర్థి సంవత్సర ఆదాయము ఐదు లక్షలకు మించరాదు. అభ్యర్థుల ఎంపిక విధానం డిగ్రీ / బిఈడి పరీక్షలో పొందిన మార్కులు. రిక్రూట్మెంట్ ఏజెన్సీ సూచించిన విధంగా మరియు రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టైపెండ్ స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలు పైన తెలిపిన వెబ్ సైట్ లో లభించును అని తెలియజేశారు.ఇతర వివరములకు ఫోన్ నెం: 08462-241055 ను సంప్రదించగలరు. (లేదా) సుభాష్ నగర్ లోని నిర్మల హృదయ కాలేజికి ఎదురుగా ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ రెండవ అంతస్తులో గల బీసీ స్టడీ సర్కిల్ నందు సంప్రదించగలరు అని తెలియజేశారు.

Spread the love