బాలురకు కల్పించిన అవకాశాలు బాలికలకు కల్పించడం లేదు

నవతెలంగాణ – తొగుట
బాలురకు కల్పించిన అవకాశాలు బాలికలకు కల్పించడం లేదని ఆర్థిక అక్షరాస్యత నిపుణులు నాగరాజు అన్నారు. శనివారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని తొగుట మండలంలోని అన్ని పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థు లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బాలురకు కల్పించిన అవకాశాలు బాలికలకు కల్పించడం లేదన్నారు. దేశ అభివృద్ధిలో స్త్రీ పురుషుల సమాన భాగస్వా మ్యం ఎంతైన అవసరం ఉందని తెలిపారు. అలాగే వివిధ రకాల కారణాల వలన చదువుకున్న వయ సులో పిల్లలు హోటల్ లల్లో, పౌల్ట్రీ ఫామ్ లలో, ఫ్యాక్టరీలలో, మెకానిక్ షాపులలో పనిచేస్తున్నారని అలా ఎవరైనా పని చేస్తున్నట్టు మీకు తెలిస్తే 1098కి ఫోన్ చేయాలని సూచించారు. అలాగే మన చుట్టుపక్కల వాళ్లలో కొంతమంది మనతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ మన శరీరం లోని రహస్య భాగాలపై టచ్ చేస్తూ ఉంటారని అలా ఎవరైనా చేస్తే వెంటనే తిరస్కరించడమే కాకుండా అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. దాంతోపాటు ఫోక్సో చట్టాన్ని వివరిస్తూ పోక్సో చట్ట ప్రకారం ఎవరి మీదనైనా కేసు నమోదు అయితే ఏడు సంవత్సరాలు మొదలుకొని జీవి తాంతం జైలు పాలు కావాల్సి వస్తుందని కొన్ని, సందర్భాలలో ఉరిశిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు అందరూ సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రా మ్ లలో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారని అలా చేయడం మూలంగా ఇప్పటికే చాలామంది ఆ ఫోటోలను  మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నా రని, దానివలన పరువు తో పాటు కొన్ని సందర్భా ల్లో అసహనానికి గురై ప్రాణం తీసుకుంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. భేటీ బచావో బేటి పడావో అంశంతోపాటు బాలికల సమృద్ధి యోజన, స్కాలర్ షిఫ్, మిషన్ వాత్సల్య, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, భరోసా కేంద్రం, అమ్మాయికి ఉచిత బస్సు సౌకర్యం, పోషణ అభి యాన్, అంశాల గురించి సంపూర్ణంగా వివరిం చారు. అనంతరం చదువు పూర్తి చేసుకున్న తర్వా త మహిళలకు ఉండే ఉపాధి ఉద్యోగాల గురించి వివరించారు. మహిళలకు మిషన్ శక్తి ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకం, సఖి కేంద్రం, సురక్ష ఋతు ప్రేమ, స్నేహిత కేంద్రం, ఒంటరి మహిళ పెన్షన్లు,  ముద్ర లోన్లు, అన్నపూర్ణ పథకం, ఉజ్వల హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, షీ టాక్సీ పథకం గురించి వివరించారు. అలాగే మహిళలకు గల చట్టాలు, మహిళలు గల హక్కుల గురించి, మహిళకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి తెలి పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love