వార్ధక్యం చేరువౌతున్నా వేధింపులకు కొదవలేదు

‘వాన ఉంటె కరువు లేదు, పెనిమిటి ఉంటె దారిద్య్రం లేదు’. ‘సంపాదించేవాడు పొతే సహగమనం తప్పదు’, ‘మొగుడు పోయిన మూన్నాళ్ళ తర్వాత ముద్ద దొరకదు’, ‘వైధవ్యం కన్న మరణం మిన్న’, ‘తల చెడితే తోబుట్టువులూ తలుపు తియ్యరు’… ఇటువంటి సామెతలను మనం పుట్టినప్పటి నుండి వింటున్నాం. వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఆ సామెతలు భర్త పోయిన స్త్రీ పరిస్థితులను వివరిస్తుంటాయి. కాలం మారినా ఆ సామెతలను వాడడం మానలేదు. వితంతువులను వేధించడమూ తగ్గలేదు. వైధవ్యానికి వార్ధక్యం తోడైతే వనితల పరిస్థితి నేటికీ విషాదకరంగానే ఉంటోంది. విద్య- విత్తం ఉన్నా, ఉన్నతోద్యోగం చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వార్ధక్యానికీ వేధింపులకూ అవినాభావ సంబంధం ఉంటోంది. వేధించే వారి సంఖ్య పెరుగుతోంది కానీ వారి సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. జూన్‌ 15వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల దినోత్సవం సందర్భంగా మన దేశంలో వృద్ధుల స్థితిగతుల గురించి ఓసారి పరిశీలిద్దాం.
వయసు మళ్ళిన భార్యలమీద కూడా వద్ధులైన భర్తలు అదే పద్ద్ధతిలో అత్యాచారాలు చేయడం అమానుషం. అలాంటి సంఘటనలు ఇప్పటికీ కొనసాగడం అవమానకరం. ఒంటరి వద్ధురాళ్లను వధించి వొంటి మీద వస్తువులు వొలుచుకున్నట్లుగా ఒంటరి వద్ధురాళ్లను బలాత్కరిస్తున్న పురుషపుంగవుల పైశాచికత్వాన్ని గురించీ టీవీలో చూస్తున్నాం బాధపడుతున్నాం. సుమారూ 90 యేళ్ళున్న అనారోగ్యం బారినపడిన వద్ధురాలిని ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ కి చెందిన 24 ఏళ్ళ యువకుడు బలాత్కరించడాన్ని విని నోళ్లు వెళ్ళబెట్టాం. అది ఒక ఉదాహరణ మాత్రమే. బయటకి రానివి ఎన్నెన్నో ఉన్నాయి.
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనే వద్ధుల సంఖ్య ఒక మిలియన్‌ వైపుకు అడుగేయగా 2010 కల్లా అది పది మిలియన్లకి పెరిగింది. మొత్తం జనాభాలో పది శాతానికి చేరి 2050 నాటికి వద్ధుల సంఖ్య 20 శాతం దాకా పెరగబోతోంది. ఇప్పటికే అభివద్ద్ధి చెందిన జపాన్‌, జెర్మనీ దేశాల్లో 23%, 24% దాకా వద్ధుల జనాభా చేరుకుంది. ఆధునిక వైద్యం వద్ధుల మరణాల రేటును తగ్గిస్తూ వచ్చింది. ఎనభై అయిదేళ్లకి పైగా జీవిస్తున్న వారి సంఖ్య ఆరు రెట్లదాకా పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా అట్టడుగున ఉన్న వారి పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగ దయనీయంగా ఉంటోంది. జీవితకాలం పెరుగుతోంది కానీ జీవించి ఉన్నంతకాలం వ్యధాభరితంగా బతుకును వెళ్లదీయవలసి వస్తోంది. జీవితకాలం మహిళలకు పురుషుడి కంటే ఎక్కువ ఉండడం వల్ల శారీరక, సమస్యలూ మానసిక బాధలతో బ్రతకవలసి వస్తోంది. బాల్యంలో తండ్రి, పెళ్లయ్యాక భర్త, వార్ధక్యంలో కొడుకు స్త్రీ ని రకరకాలుగా వేధిస్తున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా అణచివేస్తూనే ఉన్నారు. బాలికలూ, యువతులపై జరుగుతున్న వేధింపుల గురించి మనం వింటూనే ఉన్నాం. ఆ వేధింపుల కథలు ట్రోల్‌ అవుతుండడం వల్ల వారిసమస్యలను ఆకళింపు చేసుకుంటున్నాం. వేధించినవారికి శిక్షలు పడాలని కోరుకుంటున్నాం.
వద్ధుల వేధింపుల వ్యతిరేక దినోత్సవం ఆవిర్భావం 1974 లో ‘గ్రానీ బాషింగ్‌’ పేరుతో వద్ధురాళ్ల వెతలు వెలికి తీస్తూ వద్ధులపై హింస మీద ఒక వ్యాసం ఇంగ్లాండ్‌ దేశ పత్రిక ప్రచురించింది. ఆ వ్యాసం వద్ధుల మీద ఇంటా బయటా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించినది. వేధింపుల కారణంగా పెద్దలు అనుభవిస్తున్న బాధలను రిపోర్ట్‌ లాగ ఏకరువు పెట్టినది. ఆ వ్యాసం మొట్టమొదటి సారిగా వేధింపులపై వ్యతిరేకత రావాలని సూచించిన వ్యాసంగా చెప్పుకోవాలి. అది వెలుగులోకి రాగానే ఇంకెన్నో కుటుంబాలలో, ఆసుపత్రుల్లో చాపకింద నీరులాగ ఎక్కువైపోతున్న వద్ధుల వేధింపులను గూర్చిన సంఘటనలను ఉదాహారణలతో సహా వ్యాసాలలో ఏకరువు పెట్టారు విలేకరులు. 1982 లో యునైటెడ్‌ స్టేట్స్‌ అఫ్‌ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అడల్ట్‌ ప్రొటెక్షన్‌ లాస్‌ తెచ్చి వద్ధుల వేధింపులపై వ్యతిరేకత చూపేందుకు ముందుకు వచ్చాయి. యునైటెడ్‌ నేషన్స్‌ ఈ విషయంలో స్పందించింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. సమస్యలమీద లోతుగా దష్టిని పెట్టింది. దాని ఫలితమే అంతర్జాతీయ వద్ధుల వేధింపుల వ్యతిరేక దినోత్సవం. 2006 జూన్‌ 15న మూడుతరాల ప్రజలను వద్ధుల సమస్యలను గూర్చి ఆలోచించి పరిష్కారాలకై అందరూ పరిశ్రమించవలసిందిగా కోరడం వద్ధుల వేధింపుల వ్యతిరేక దినోత్సవ ఉద్దేశం. ఒకప్పుడు ధనాన్నీ ,పేరు ప్రతిష్టలనీ సంపాందించుకున్నప్పటికీ వయసు ఉడిగి పక్కవారిపై ఆధారపడే పరిస్థితులు ఆసన్నమవ్వగానే అడుగడుగునా మోసాలు చేస్తూ, కొట్టి, తిట్టి, పెద్ద వారి నుండి అన్నీ లాక్కుని వద్ధుల హక్కులకు భంగం కలిగిస్తూ సాటి మనుషులను గౌరవించాలనే కనీస బాధ్యతను విస్మరిస్తున్న పిల్లలూ మనవలూ మొదలైన వారి కళ్ళు తెరిపిస్తూ అందరూ హింసను వ్యతిరేకించమని తెలియచేయడమే 15 జూన్‌ తేదీ ఉద్దేశ్యం.
జనాల దష్టిలోకి వద్ధుల సమస్యలు వస్తున్నాయి. ఆస్తులు లాక్కోడానికి కడుపునపుట్టిన పిల్లలు సైతం హింసకు సిద్ధపడడం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ జరుగుతోంది. పనివాళ్ళు, ఆసుపత్రి సిబ్బంది, ఇంట్లోని వారూ ఆహారవ్యవహారాల గురించి కూడా పట్టించుకోక పోవడంవల్ల సమాజం, ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. వృద్ధులపై జరుగుతున్న అరాచకాలకు ముగింపు పలికేందుకు ఎందరో ముందుకు రావడం అభినందనీయం.
వద్ధులు వేధింపులకు గురవుతున్నారనే సంగతిని కనీసం ఈ దినోత్సవం అయినా గుర్తుచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వధ్ధాశ్రమ వాసుల ఇంటర్వ్యూలు కూడా టీవీల్లో చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో వద్ధురాళ్ల వేధింపులు బాగా ఎక్కువగా ఉంటున్నాయని మనం అనుకుంటున్నాం. వాటిని ఒకసారి కొంచెం లోతుగా పరిశీలిద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా తరతరాలుగా మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు. భార్యలను శారీరకంగా వేధిస్తున్న భర్తల సంఖ్య 30% ఉండగా మానసికంగా వేధిస్తున్న వారి సంఖ్య 50% ఉండడడం బాధాకరం. అయితే ఈ రకమైన వేధింపులు వయసులో ఉన్న భార్యలేకాక వయసు మళ్ళిన స్త్రీలు కూడా అనుభవించడం మరింత బాధాకరం. మహారాష్ట్ర కల్యాణ్‌ లో 2021లో 75 ఏళ్ళ వయసున్న భార్యని భర్త బాగా కొట్టిన సంఘటనని వాళ్ళ మనవడు రహస్యంగా వీడియో తీసి తన మిత్రులకు షేర్‌ చెయ్యడం ద్వారా విషయం బయటకి వచ్చింది. మిర్రర్‌ ఆన్లైన్‌ ద్వారా ఇది సభ్యసమాజానికి తెలిసింది. మానవ హక్కుల ఉల్లంఘన స్త్రీల విషయంలో ముఖ్యంగా వద్ధురాళ్ల విషయంలో జరుగుతూనే ఉంది. ఏజ్‌ వెల్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వొకేసి సెంటర్‌లోని పరిశోధకులు 27,500 మంది గ్రామీణ స్త్రీలనూ, 22,500 మంది పట్టణాల్లో నివసిస్తున్న వద్ధురాళ్ళనూ సాంపిల్స్‌గా తీసుకుని భారతదేశంలోని 26 రాష్ట్రాలు, 330 జిల్లాల స్త్రీలమీద పరిశోధన చేశారు. ఇటూ అటుగా అన్ని చోట్లలోనూ వేధింపుకు గురి అవుతున్న స్త్రీల సమస్యలు ఒకేలా ఉన్నాయి. 80.49% వద్ధురాళ్ల ఆర్ధిక పరిస్థితి అట్టడుగున ఉండడం గమనార్హం. వద్ధురాళ్ల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా విద్య లేక కొందరు, విద్య వున్నా ఆర్ధిక పరిస్థితి బాగా లేకా రెండూ బాగానే ఉన్నా తోడ్పాటు ఇచ్చేవారు లేక వద్దస్త్రీల పరిస్థితులు పరితాపాన్ని కలిగించేలా ఉన్నాయని సర్వే తెలియ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సర్వే బట్టి 89.38% వద్ధస్త్రీలు ఇంట్లోనే వేధింపులకు గురి అవుతున్నట్టు తెలుస్తోంది. వద్ధపురుషుల మీద వేధింపులు జరుగుతున్నప్పటికీ వద్ధురాళ్ల మీద పెద్ద స్థాయిలో వేధింపులు జరుగుతున్నట్లు వివిధ సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. 71% స్త్రీలు భర్తల మరణానంతరం వేధింపుకు గురవుతున్నట్లు 1998 సర్వే తెలియచేసింది. ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ సర్వే బట్టి వద్ధ వితంతువులను 56% అల్లుళ్లూ, 39% కొడుకులూ కోడళ్ళూ వేధించడం మామూలుగానే జరుగుతోంది. కూతుళ్లు కూడా చాకిరీ చేయించుకుంటూ సతాయించడంలో ముందు స్థానంలోనే ఉంటున్నారు
భర్తలు ఎవరిమీదైనా కోపం వస్తే ఆ కోపం తగ్గించుకోడానికి భార్యల పట్ల పశువులా ప్రవర్తిస్తూ బలాత్కరించడం వింటూనే విన్నాం. కానీ వయసు మళ్ళిన భార్యలమీద కూడా వద్ధులైన భర్తలు అదే పద్ద్ధతిలో అత్యాచారాలు చేయడం అమానుషం. అలాంటి సంఘటనలు ఇప్పటికీ కొనసాగడం అవమానకరం. ఒంటరి వద్ధురాళ్లను వధించి వొంటి మీద వస్తువులు వొలుచుకోవడం, బలత్కరిస్తున్న పైశాచికత్వాన్ని గురించీ టీవీలో చూస్తున్నాం. బాధపడుతున్నాం. సుమారూ 90 యేళ్ళున్న అనారోగ్యం బారినపడిన వద్ధురాలిని ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ కి చెందిన 24 ఏళ్ళ యువకుడు బలత్కరించడాన్ని విని నోళ్లు వెళ్ళబెట్టాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. బయటకి రానివి ఎన్నెన్నో ఉన్నాయి.
కడుపున పుట్టినవారి క్రూరత్వం వయసు మళ్ళిన తల్లులను వద్ధుశ్రమాల్లో చేర్చి చేతులు కడుక్కోడం, పుణ్యక్షేత్రాలకు తీసుకు వెళ్లి అక్కడే వదిలి రావడం, ఇంట్లో మూలగదికి పరిమితం చేసి తిండి కూడా సరిగ్గా పెట్టకపోడం కొడుకులే కాదు కూతుళ్ళు కూడా చెయ్యడం అక్షరసత్యం. ఆసుపత్రిలో విడిచిపెట్టి తమ చిరునామా మార్చి ఇచ్చి జారుకోడం జరుగుతూనే ఉంది. ఆస్తి తన పేరు మీద రాయమని కొట్టిన కొడుకులూ, కోడళ్ళూ, భర్తలతో కూడి హింసించిన కూతుళ్లు, చావగొట్టి డబ్బు దోచుకుపోతున్న మనవలూ వందల సంఖ్యలో ఉంటున్నారు. మొదటి తారీకుకి వచ్చి పింఛను డబ్బును తీసుకుని ఉడాయిస్తున్నవారి సంగతి ఎంత చెప్పినా తక్కువే. తమ పిల్లలు గాయపరచినా, గొంతు పిసుకుతామన్నా తమ గోడు చెప్పుకోని తల్లులూ వందల్లోనే వున్నారు. వారి సమస్యల పరిష్కారానికై జూన్‌ 15వ తేదీన ర్యాలీలు, ప్రదర్శనలు, పెద్దలను గౌరవిస్తున్నవారిని సన్మానించడాలూ జరుగుతున్నాయి. ఎన్ని రకాలుగా ఎందరు ప్రయత్నిస్తున్నా సమస్యలు పరిష్కరింపబడడం లేదు.
వద్దాశ్రమాల్లో పాట్లు
కేర్‌ టేకర్లు వేళకి తిండి పెట్టరు, మందులివ్వరు. డబ్బు తీసుకుంటున్న ఆశ్రమాల్లో సైతం డైపర్‌ సరిగ్గా మార్చరు. పిలిస్తే పలకరు. వీలైనంతలో పెద్ద వారి వస్తువులను లాక్కోవాలని చూస్తారు. దాతలు ఇచ్చిన బియ్యం పప్పులూ ఉప్పులూ దుప్పట్లు అమ్ముకునే వారూ ఉన్నారు. ఆసుపత్రులు ఎన్నో ఆశ్రమాలకు దూరంగా ఉంటాయి. పదిరోజులకు ఒకసారి డాక్టర్‌ వచ్చి పోతాడు. అనారోగ్యంగా ఉన్న స్త్రీలను వైద్యుడి దగ్గరికి తీసుకు వెళ్లడాన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యంతో వున్న తల్లుల్ని ఇళ్లకు తీసుకు వెళ్లడం విషయంలో పిల్లలు ఉదాసీనంగా ఉంటారు. చనిపోయినా చూడడానికి రారు. ఇక దహన సంస్కారాలు ఏమి చేస్తారు?
సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్లు, సంఘసేవకులు ఈ విషయంలో ఇంకింత జోరుగా పరిశ్రమించి వద్ధురాళ్ల సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉంది. మహిళా సంఘాలు బాలికలూ, మహిళల సమస్యలపై స్పందించినట్లుగా వద్ధురాళ్ల సమస్యలపై స్పందించాలి. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14567 కి రెస్పాండ్‌ అయ్యి సహకరించే సిబ్బంది ఉండాలి. పిల్లల పాఠ్య గ్రంథాల్లో వద్ధురాళ్ల భద్రతని గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించవలసిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా నేరస్తులకు శిక్షలు కఠినంగా వెనువెంటనే విధించడంలో ప్రభుత్వం త్వరపడాలి. అమానుషంగా ఎక్కడ ఎవరు ప్రవర్తించినా ప్రజలు అరికట్టేందుకు కలసికట్టుగా ముందుకు రావాలి. ఈ విధంగా చేస్తే వద్ధ స్త్రీల పై వేధింపులూ, లైంగిక దాడులు అంతరిస్తాయి.
– డా||జి శోభా పేరిందేవి, 92465 46584

Spread the love