బీసీలను నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం చెబుతాం

– అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కష్ణయ్య
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ, కుల, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర రాజకీయ పార్టీలు బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పిస్తామని బీసీ బిల్లు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ పై తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు , ఎంపీ ఆర్‌.కష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో 86 బీసీ కుల సంఘాలు, 22 బీసీ సంఘాలు, 18 బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీ ఆర్‌.కష్ణయ్య, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ లకు ఏ రంగంలో కూడా ప్రజాస్వామిక విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో వాటా ఇవ్వలేదన్నారు. రాజకీయ పారిశ్రామిక జనాభా ప్రకారం 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదన్నారు. ప్రధానమంత్రి ఒక బీసీ కులానికి చెందిన వారు ఉండి కూడా బీసీల అభివద్ధికి యొక్క చిన్న డిమాండ్‌ను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోవడం దేశంలోని 70 కోట్ల మంది బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శిం చారు. ఇది ప్రజాస్వామ్య దేశం బీసీలు బిచ్చగాళ్లు కాదు వాటాదారులు వాటా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు ఇదేమి న్యాయం భారతమాత ముద్దుబిడ్డలం అందరికీ సమన్యాయం పాటించాలని కోరుతున్నామని బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీజేపీ బీసీల అనుకూల వైఖరి అవలంభించి బీసీలకు చట్ట‌సభల్లో 50% రిజర్వేషన్‌ అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో చిత్తుగా ఓడిస్తామని కేం ద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల న్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించాలని బీసీ యాక్ట్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రయివేట్‌ రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కష్ణ, కోలా జనా ర్ధన్‌, భరత్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, కొండ దేవయ్య, గూజ్జ సత్యం, నీల వెంకటేష్‌, ఎర్ర మధు వెంకన్న, చిలంపల్లీ రమేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, యాదగిరి, నందగోపాల్‌ వేముల రామకష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love