ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం

– సీఎం రేవంత్‌ రెడ్డి సీఎంను కలిసి ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా
నవతెలంగాణ నాగోల్‌
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పూర్వ తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌) అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉప్పల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం మాట్లా డుతూ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి, ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేద, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులంతా కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని, లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా కాంగ్రెస్‌ గూటికి చేరడం శుభపరిణామం అని అన్నారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లా డుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల అభ్యు న్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్న విశ్వాసం ఉంద న్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, సీని యర్‌ నేత మైనంపల్లి హనుమంతరావులను కూడా కలి శారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐవీఎఫ్‌ స్టేట్‌ జన రల్‌ సెక్రెటరీ పబ్బా చంద్రశేఖర్‌, ట్రెజరర్‌ కొడిపాక నారా యణ, కటకం శ్రీనివాస్‌, ఐవీఎఫ్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ కట్టా రవికుమార్‌, ట్రెజరర్‌ నరేష్‌ గుప్తా తదితరులు ఉన్నారు.

Spread the love