రెండోరోజు 8 నామినేషన్లు

నవతెలంగాణ-సిటీబ్యూరో
మహనగర పరిధిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, లోక్‌సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం 8 నామినేషన్లు దాఖలు అయ్యా యి. హైదరాబాద్‌ స్థానానికి ఏఐఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ అక్రమ్‌ అలీ ఖాన్‌లు ఒక్కో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ లో బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి నాలుగు సెట్లు, బీఆర్‌ఎస్‌ నుంచి పద్మారావు గౌడ్‌ 2 సెట్ల చొప్పున నామినేషన్‌ పత్రాలను సమర్పిం చారు. సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బి.సునీతా రాణి, యుగతులసి పార్టీ పక్షాన కొలిశెట్టి శివకుమార్‌, సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(కమ్యూనిస్టు) అభ్యర్థిగా గంగాధర్‌, ఇండిపెండెంట్‌గా చలిక చంద్రశేఖర్‌ ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నామినేషన్లు ప్రారంభమైన 18వ తేదీ గురువారం రెండు పార్లమెంట్‌ నియోజవర్గాల పరిధిలో ఒక్క నామినేషన్‌ దాఖలు చేయలేదనే విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరించే నామినేషన్లను ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
మల్కాజిగిరిలో అయిదుగురు..
ఈ లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా ఓరుగంటి వెం కటేశ్వర్లు, పెండ్యాల సాయి వరప్రసాద్‌, రాజేష్‌ మిశ్రా శివ్‌, చలిక చంద్రశేఖర్‌ నామినేషన్‌ పత్రాల దాఖలు చేయగా, కుడుపూడి వీవీ ఎస్‌ నారాయణ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.
చేవెళ్ల నుంచి ముగ్గురు..
ఎంసీపీఐ(యూ) పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్‌, ఇండియా నేషనల్‌ లీగ్‌ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్‌ చాంద్‌ పాషాలు రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్లు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ తరఫున మేకల భిక్షపతి నామినేషన్‌ దాఖలు చేశారు.
ప్రార్థనల అనంతరం..
నామినేషన్‌ దాఖలు చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ
హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఏఐఎంఐఎం అభ్యర్ధిగా అస దుద్దీన్‌ ఒవైసీ నామినేషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నాం హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కామసీదులో జుమా-ఏ-నమాజ్‌ ప్రార్ధనలు నిర్వహించి చార్మినార్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా లక్డీకాపూల్‌లో హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు చేరుకోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ఆయన కుమారుడు సుల్తాన్‌సలాఉద్దీన్‌ ఒవైసీతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అహ్మాద్‌ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తులు.. రూ.23.87 కోట్లు
హైదారాబాద్‌ లోక్‌సభ ఏఐ ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్‌ ఒవైసీ తన స్థిర, చర ఆస్తి వివరాలను ప్రకటించారు. హైదరాబా ద్‌ ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన నేపథ్యంలో తాజాగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినే షన్‌ పత్రాల్లో ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబానికి రూ. 23.87 కోట్ల ఆస్తులు, రూ. 7.05 కోట్ల అప్పులు ఉన్నట్టు తెలి పారు. వివిధ కోర్టుల్లో అయిదు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల్లో తన పేరిట రూ. 16.01 కోట్ల విలువగల స్థిరాస్తులు, రూ. 2.80 కోట్ల విలువగల చరాస్తులు, తన భార్య పేరిట రూ. 4.90 కోట్ల విలువగల స్థిరాస్తులు, రూ.15.71 లక్షల విలువగల చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. తన చేతిలో రూ.2లక్షలు, తన భార్య చేతిలో రూ.50 వేల నగదు, భార్యకు 20 తులాల బంగారం ఉందని, తన పేరు మీద రూ. 4.30 కోట్ల అప్పులు, తన భార్య పేరిట రూ.2.75 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు. తనకు, తన భార్యకు ఎలాంటి వాహనం లేదని అఫిడవిట్‌లో వెల్లడించారు.

నామినేషన్‌ దాఖలు చేసిన పద్మారావు
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశా రు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని తన నివాసం నుంచి ఎమ్మెల్యే లు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముఠా గోపాల్‌, మాగంటి గోపీనాథ్‌ , కాలేరు వెంకటేష్‌లతో కలిసి వెస్ట్‌ మారేడ్‌ పల్లి లోని జోనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి ఆర్‌ఓకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరాన్ని గత పదేండ్లలో ఎంతో అభివద్ధి చేశామని తెలిపారు. ప్రజలందరూ ఆలోచించి బీఆర్‌ ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ఎంపిగా గెలిచిన తర్వాత పార్ల మెంట్‌లో మన సమస్యలపై గళం విప్పి పోరాడవచ్చున్నారు. తల సాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ పదేండ్లలో హైదరాబాద్‌ తాగు నీటి సమస్య, కరెంట్‌ సమస్యలు లేకుండే.. కానీ ఇప్పుడు అడుగడుగునా నీటి కష్టాలు ఎదురైతున్నాయన్నారు. పద్మారావు గౌడ్‌కు ఎంతో అనుభవం ఉందని, అందరి మధ్య ఉంటాడని కావున పజలందరూ ఆలోచించి పద్మారావుగౌడ్‌ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు..కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love