‘లివర్‌ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలి’

– వర్డల్‌ లివర్‌ డే సందర్భంగా గ్లెనిగల్స్‌ ఆస్పత్రిలో అవగాహన
నవతెలంగాణ-సీటీబ్యూరో
లివర్‌ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలని లివర్‌ సంబంధిత వ్యాథులను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే లివర్‌ క్యాన్సర్‌, లివర్‌ సిర్రోసిస్‌ వంటి ప్రమాదకర వరిస్థితులకు దారితీయకుండా జాగ్రత పడ వచ్చని వరల్డ్‌ లివర్‌ డే థీం ప్రకటించింది. ఈ నందర్భంగా గ్లెనిగల్స్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం సైక్లథాన్‌, వాకథాన్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్లెనిగల్స్‌ ఆస్పత్రిలో సీసీఈఓ డాక్టర్‌ నాగేష్‌ రావు మాట్లాడుతూ గ్లెనిగల్స్‌ ఆస్పత్రిలో 1000 పైగా లివర్‌ మార్చిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఏకైక సెంటర్‌ అన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా లివర్‌ మార్చిడి చేసిన ఘనత, మల్టీ ఆర్గాన్‌ (కిడ్ని, కాలేయం) మార్పిడి, నగరంలో స్ప్లిట్‌ లివర్‌ మార్పిడి , చిన్నారికి మోనో సెగ్మెంట్‌ కాలేెయ మార్పిడిని తొలిసారిగా నిర్వహించిన ఘనత గ్లెనిగల్స్‌ ఆస్పత్రి సొంతమన్నారు. అనంతరం సీనియర్‌ హెవటాలజిస్ట్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ చందన్‌కుమార్‌ మాట్లాడుతూ లివర్‌ నంబంధ వ్యాధులకు ప్రధానంగా అల్కహాల్‌, ఫ్యాటీలివర్‌, ఊబకాయం వంటి కారణాలు ప్రధానంగా చెప్పవచ్చన్నారు. లివర్‌ వ్యాధుల వట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు రెగ్యులర్‌గా లివర్‌ చెకప్‌లు చేయించుకుంటూ ఫ్యాటీ లివర్‌ నుంచి కాపాడుకోవాలని లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అండ్‌ హెచ్‌ పీబీ సర్జన్‌ డాక్టర్‌ అమర్నాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో సైక్లథాన్‌, ప్రజ లు, డాక్టర్లతో కలిసి వాకథాన్‌లను నిర్వహించారు. వాకథా న్‌ను సైఫాబాద్‌ ఏసీపీ సంజరు కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌ప్లాంట్‌ అనస్థీషి యాలజిస్ట్‌లు డాక్టర్‌ స్మిత్‌, గణేష్‌, కాలేయ మార్పిడి శస్త్రవై ద్యుడు రాజగోపాల్‌ ఆచార్య, హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ వ్యవస్థావకులు రవీందర్‌, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love