జైలుకు వెళ్లేందుకు ఎన్నడూ భయపడలేదు: కేసీఆర్‌

నవతెలంగాణ – మిర్యాలగూడ: ‘ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారు. సాగర్‌ ఆయకట్టు కింద పంటలను ఎండపెట్టారు.మిషన్‌ భగీరథను సరిగా నడపలేని పరిస్థితి’’అని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై  కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాసను గెలిపించాలని ప్రజలకు కోరారు. అప్పుడే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేపట్టొచ్చని అన్నారు. జైలుకు వెళ్లేందుకు తాను ఎన్నడూ భయపడలేదని, భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.

Spread the love