బీఆర్‌ఎస్‌ను పాతరేస్తాం

– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ఒక్కటే డీఎన్‌ఏ
– 8న వరంగల్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ : జి.కిషన్‌రెడ్డి
– సోషల్‌మీడియాలో ప్రచారాలను ఆపండి.. అప్రమత్తంగా ఉండండి : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మోడల్‌ అంటే కుటుంబ పాలననేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ఒక్కటే డీఎన్‌ఏ అనీ, ఆ రెండు పార్టీలూ నాణానికి బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. ఈ నెల 8న వరంగల్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రైల్వే వ్యాగన్‌ యూనిట్‌కు భూమిపూజ చేస్తారనీ, 500 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ సిటీ కార్యాలయంలో బండి సంజరుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌ వేసినట్టేనని విమర్శించారు. కుట్ర పూరితంగా తెలంగాణలో బీజేపీపై ఆ రెండు పార్టీలూ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపిం చారు. టీఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే బండిని మార్చారనే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పాలనపైనా, అవినీతిపైనా బీజేపీ పోరాడుతున్నదని చెప్పారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మమరిం చారనీ, మాటలతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ది పొందు తున్నారని విమర్శించారు. సైన్స్‌ సిటీకి 20 ఎకరాల భూమి అడిగితే కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసుకు కంటోన్మెంట్‌లో పదెకరాలు, బీఆర్‌ఎస్‌ ఆఫీసుకు 11 ఎకరాలు కేటాయించి ందని విమర్శించారు. జీపీలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేసింద న్నారు. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతలు వ్యాపారాలు చేసుకునే వారిని, బిల్డర్లను బెదిరిస్తూ వాటాలు, షేర్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
బండి సంజరు మాట్లాడుతూ..కిషన్‌రెడ్డికి శుభా కాంక్ష లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తుచేశారు. తమలాంటి నేతలకు ఆయన గురువు లాంటివారన్నారు. సోషల్‌ మీడియా లో కిషన్‌రెడ్డి, బండి, ఇతర నేతల గ్రూపుల పేరుతో చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని కోరారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టాలని చూస్తున్న వారి పోస్టులను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు గౌతంరావు పాల్గొన్నారు.

Spread the love