బీజేపీ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను వ్యతిరేకిద్దాం..

– కార్మికవర్గ ఐక్యతను కాపాడుకుందాం
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలను, మతోన్మాద విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తూ తమ ఐకత్యను కాపాడుకో వడమే నేడు కార్మిక వర్గం ముందున్న ప్రధాన కర్తవ్యమని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సీఐటీయూ సిటీ కార్యాలయంలో ‘బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్‌-మతోన్మాద విధానాలు-కార్మికవర్గ కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కె. అజరు బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌ మాట్లా డుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదనే భయంతో కార్మికవర్గ ఐక్యతను పక్కదారి పట్టించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, భావోద్వే గాలతో మతాన్ని రాజకీయ స్వార్ధం కోసం దుర్వినియోగపరు స్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోయి.. అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ పెరిగి.. పెట్టుబడి దారులు లాభాలు గణనీయంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద శక్తులు కొన్నేండ్లుగా దేశంలో మైనార్టీల పట్ల విద్వేషం రెచ్చగొడ్తున్నాయని, హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపు తున్నారన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి కుంభకోణాలను, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరల పెంపుదల తదితర సమస్యలపై నిలదీస్తున్న వారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదల ఇండ్లు కూల్చుతున్నారని, సజీవదహనాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఆర్టికల్‌ 370, 31ఎ రద్దు, సీఏఏ, ఎన్‌ఆర్‌, ఎన్పీఆర్‌ పేరిట వేధింపులు, ట్రిపుల్‌ తలాఖ్‌, హిజా బ్‌, అజాన్‌, హలాల్‌, గొడ్డు మాంసం తరలిస్తున్నారని మైనార్టీలపై మూక దాడులు, గో రక్షణ పేరిట హత్యలు, కామన్‌ సివిల్‌ కోడ్‌ వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాశీ, మధుర, అంజనాద్రి (హనుమంతుడు పుట్టిన స్థలం) పేరిట వివాదాలు సృష్టించారని తెలిపారు. దేశవ్యాప్తంగా మైనార్టీల ప్రార్ధనా స్థలాలపై దాడులతో పాటు మత సామరస్యానికి నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి టెంపుల్‌ పేరిట ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మనుధర్మ సిద్ధాంతం ప్రకారం మహిళలకు చదువుతో పాటు ఉద్యోగాలు చేసే హక్కును నిరాకరిస్తుందన్నారు. దళిత, గిరిజన, బలహీన తరగతులను శూద్రులుగానే బతకమని ఆదేశి స్తుందని,. సనాతన ధర్మం. పేరుతో ఫ్యూడల్‌ వ్యవస్థను బలపరు స్తుందన్నారు. ఈ విషయాలన్నింటినీ కార్మిక వర్గం చైతన్యంతో ఆలోచించి తమ ఐక్యతను కాపాడుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని జె. వెంకటేష్‌ కోరారు.
సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేష్‌ మాట్లా డుతూ అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, భిన్న సంస్కతీ, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచ దేశాల్లో సమున్నత గౌరవం ఉందని, బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తుల స్వార్ధపూరిత రాజకీయాలతో మత విద్వేషాలు మరింత రగిలితే దేశ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా ఆర్థిక సార్వభౌ మత్వానికి, అభివృద్ధికి తీవ్ర ఆటంకమన్నారు. ప్రజల ఐక్యతకు, కార్మికవర్గ హక్కులకు ప్రతిబంధకం అని విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కదలాలన్నారు. సదస్సులో సీఐటీయూ నగర కోశాధికారి ఆర్‌.వాణి వందన సమర్పణ చేశారు. ఈ సదస ు్సలో సీఐటీయూ నగర నాయకులు, సి. మల్లేష్‌, వి.కామేష్‌ బాబు, జి.రాములు, టి.మహేందర్‌, పి. మల్లేష్‌, పి.శ్రీనివాస్‌, ఎం. సత్యనారాయణ, పి. పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love