‘సీపీఐ ప్రజా గర్జన’ పోస్టర్‌ విడుదల

నవతెలంగాణ-కాప్రా
పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సీపీఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగా యని ఉద్ఘాటిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భద్రా ద్రి- కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో జూన్‌ 4వ తేదీన లక్షలాది మందితో ‘సిపిఐ ప్రజా గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఎస్‌. బోస్‌ తెలిపారు. బహిరంగ సభకు సంబంధించిన గోడ పత్రికను ఈసీఐఎల్‌ లోని నీలం రాజశేఖర్‌ రెడ్డి భవన్‌ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జూన్‌ 14 నుంచి మే 14 వరకు ‘బిజెపి కో హఠావో- దేశ్‌ కో బచావో’ కార్యక్రమం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తున్న మతో న్మాద విభజన విధానాలను , రాజ్యాంగాన్ని బలహీనవ రుస్తూ తీసుకుంటున్న చర్యలు, ప్రయివేటీకరణ వంటి అంశాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. 2వేల నోట్ల రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ అసమర్థ కోణం మరో సారి అర్థమైనదని వారు విమర్శించారు. తాజాగా వాటిని రద్దు చేయడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను నిర్వీర్యం చేయడం, పార్లమెంటు ఎన్నికలు, ముందు వచ్చే తెలంగాణ , తదితర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీలకు ఆర్థికంగా చక్రబంధం వేసే బిజెపి పన్నాగంగా కనపడుతోందన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్‌ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్‌ రెడ్డి, సీపీఐ మేడ్చల్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌. శంకర్‌ రావు,ఏ ఐ వై ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్‌ మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్‌,సీపీఐ కాప్రా పట్టణ కార్యదర్శి జీ. లక్ష్మీ నారాయణ, నేతలు ఏం. నర్సింహా, బాబు రావు తదితరులు పాల్గొన్నారు

Spread the love