తగ్గిన బంగారం, వెండి ధరలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధరకు  కాస్త బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర రూ.74,300గా (పన్నులు కలుపుకొని) ఉంది. వెండి కిలో ధర సైతం రూ.2 వేల వరకు తగ్గింది. 83,300 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 2322 డాలర్లుగా ఉంది. ఒక్కరోజులోనే దాదాపు 50 డాలర్లకు పైగా తగ్గింది.

Spread the love