నవతెలంగాణ – గోవిందరావుపేట
సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ విభాగంలో గోవిందరావుపేట మండల జట్టు ప్రథమ స్థానంలో నిలిచి మండల గౌరవాన్ని పెంచింది. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్పు జిల్లాస్థాయి క్రీడా పోటీలలో గోవిందరావుపేట మండలానికి చెందిన కబడ్డీ జట్టు ప్రథమ స్థానంలో రాణించి సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామమైన కర్లపల్లి ప్రాంతం నుండి క్రీడకు వెళ్లిన యువత కబడ్డీలో అద్భుతంగా రాణించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ములుగు జిల్లా స్థాయిలో కబడ్డీలో విజేతగా నిలిపి మండలానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ఆటగాళ్లను పేరుపేరునా శ్రీనివాసరెడ్డి అభినందించారు. వాలీబాల్ క్రీడల్లో కూడా మండల క్రీడాకారులు సత్తా చాటుతారని నేడు సెమి ఫైనల్ వరకు వెళ్లిన జట్టు గెలిచి రేపు ఫైనల్ లో తెలపడం ఉందని తెలిపారు. క్రీడాకారులను అభినందించిన వారిలో వీటిలో యాలం ఆదినారాయణ కనకయ్య ములుగు జిల్లా కబడ్డీ క్రీడా అసోసియేషన్ సభ్యులు చింత కృష్ణ ఉన్నారు.