మెడికల్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – అమరావతి : విజయవాడ బందర్ రోడ్‌లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. భారీగా పొగ కమ్మేయటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love