దశాబ్ది ఉత్సవాల సమావేశం నిర్వహించిన మంత్రి వేముల

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా కలెక్టరేట్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు . ఈ సమావేశంలో ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్,ఎమ్మేల్యే గణేష్ గుప్తా,జెడ్పీ చైర్మన్ విఠల్ రావు,మహిళాభివృద్ది కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత,మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్లు,జిల్లా అన్ని శాఖల ఉన్నతాధికారులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల మద్దతు తో కేసీఆర్ గారు ప్రాణాలు పణంగా పెట్టు ప్రత్యేక రాష్ట్రం సాధించారు.సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుంది..
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రం లో 16 లక్షల ఎకరాల్లో వరి పండితే ఇపుడు 56 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది..ఇది కేవలం కేసీఆర్ గారి నిర్ణయాలు ,రైతు సంక్షేమ కార్యక్రమాల వల్లనే సాధ్యం అయింది.దేశానికి ధాన్యాగారం గా చెప్పుకునే పంజాబ్ ను కూడా వరి సాగులో తెలంగాణ అధిగమించింది.50 శాతంకంటే ఎక్కువ దేశానికి ధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఫాక్స్ కాన్ లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి క్యు కడుతున్నాయి అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్దే కారణం.ఇలా 9 ఏళ్లలో సాధించిన ప్రగతి వివరించే విధంగా దశాబ్ది ఉత్సవాలు జరగాలి.దశాబ్ది వేడుకలను ఘనంగా గా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశం.అన్ని గ్రామాల్లో పండగ వాతావరణం లో వేడుకలు జరగాలి..ఇందుకు అందరి సహకారం అవసరం. అందరి భాగస్వామ్యం తో ఘనంగా జరుపుకోవాలి.ప్రతి మండలాని కి ఒక నోడల్ అధికారి ఏర్పాటు చేసుకోవాలి.వార్డు వార్డు లో సమన్వయ కమిటీలు నియమించాలి.
జూన్ రెండు నుండి 22 వరకు ఉత్సవాలు..
కేసీఆర్ ఆదేశాల మేరకు రోజుకు ఒక్క కార్యక్రమం..
జూన్ 2 న మంత్రుల అధ్వర్యంలో లో పతాక వందనం ఉంటది..మొదట అమర వీరులకు నివాళి అర్పించింది కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.. జూన్ 3 న తెలంగాణ రైతు దినోత్సవం అన్ని రైతు వేదికల్లో ఉత్సవాలు జరగాలి. జూన్ 4 న సురక్ష దినోత్సవం..జిల్లా స్థాయిలో పోలీసు శాఖ సాధించిన విజయాలను వివరిస్తూ వేడుకలు జరగాలి.జూన్ 5 న తెలంగాణ విద్యుత్ విజయోత్సవం..మనం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి.. నాడు కారు చీకట్లో ఉన్న తెలంగాణ నేడు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతుంది.జూన్ 6న పారిశ్రామిక ఉత్సవం.ఐటి కారిడార్ సభలు. టిఎస్ – ఐపాస్, కెటిఆర్ గారి కృషి వల్ల సుమారు 20వేల పరిశ్రమలు వచ్చాయి.4లక్షల కోట్ల పెట్టుబడులు,యువతకు 16 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఐటి ఎగుమతులు 57వేల కోట్ల నుంచి 3లక్షల కోట్లకు పెరిగాయి. జూన్ 7 సాగునీటి దినోత్సవం..నీటి పారుదల లో మనం సాధించిన విజయాలను ప్రజలకు తెలియ జేయాలి.జూన్ 8 న చెరువుల పండగ.జూన్9 నతెలంగాణ సంక్షేమ సంబరాలు
జూన్ 10తెలంగాణ సుపరిపాలన దినోత్సవం.
జూన్ 11 న సాహిత్య దినోత్సవం.
జూన్ 12 తెలంగాణ రన్ డే.
జూన్ 13 న మహిళా సంక్షేమ దినోత్సవం.
జూన్ 14 న వైద్య ఆరోగ్య దినోత్సవం.
జూన్ 15 న పల్లె ప్రగతి దినోత్సవం.
జూన్ 16 న పట్టణ ప్రగతి దినోత్సవం.
జూన్ 17 న గిరిజన దినోత్సవం.
జూన్ 18 నమంచినీళ్ళ పండగ.
జూన్ 19న హరితోత్సవం.
జూన్ 20 న తెలంగాణ విద్య దినోత్సవం.
జూన్ 21 న ఆధ్యాత్మిక దినోత్సవం.
జూన్ 22 నఅమరులకు నివాళి స్మారక చిహ్నం ప్రారంభం.ఇలా రోజుకో రీతిలో ఆయా రంగాల్లో సాధించిన విజయాలపై దశాబ్ది ఉత్సవాలు సంబరంగా జరగాలి.అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు కావున అధికారులు సిబ్బంది ఎవరు కూడా తప్పించుకోకుండా అందుబాటులో ఉండాలన్నారు.

Spread the love