న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఫ్లాటు జప్తు

– మనీలాండరింగ్‌ కింద ఈడీ చర్య
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థకు చెందిన ఫ్లాటును జప్తు చేసింది. పోర్టల్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈడీ త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది. పుర్కాయస్థ నివాసంపై ఈడీ 2021 సెప్టెంబర్‌లో దాడి చేసింది. కాగా చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న అమెరికా కోటీశ్వరుడు నెవిల్లే రారు సింఘమ్‌ నుంచి న్యూస్‌క్లిక్‌కి నిధులు అందుతున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌లో ఈ వారం ఓ వార్త వచ్చింది. అయితే దీనిని న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని, వాటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని తెలిపింది.
మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద రూ.4.52 కోట్ల విలువ కలిగిన ఆస్తిని ఈడీ జప్తు చేసింది. పోర్టల్‌ను నడుపుతున్న కంపెనీలో రూ.86 కోట్ల విదేశీ సొమ్ము చేరిందంటూ వచ్చిన ఆరోపణపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. వివిధ సంస్థలకు సేవలు అందించినందుకు తమ సంస్థలో ఈ సొమ్ము జమ అయిందని న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ తెలిపింది.

Spread the love