టీయూలో ఎన్ఎస్ యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవ ముగింపు సభ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో 54 వ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకొని యూనివర్సిటీలో క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్స కార్యక్రమం కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హల్ లో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల వికాసానికి చదువుతోపాటు సమాజంలో ఉన్న అంశాల పైన కూడా అవగాహన ఉండాలని సూచించారు. యూనివర్సిటీలలో విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఈ క్రీడా పోటీలు తోడ్పడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి & ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ చైర్మన్ పస్కా నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఒక వ్యక్తి సమాజాన్ని దగ్గర నుండి పరిశీలించాలని చదువుతూ సమాజాన్ని మార్చే ప్రక్రియలు ఉద్యమాలు కీలకమని,  రాజ్యాంగ రక్షణలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని, మతతత్వ ఆలోచనలను అంతం చేయాలని లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైన యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు కొమిర శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘం ముందు ఉంటుందని, విద్యార్థి జీవితంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలను ప్రోత్సహించాలని, నిరంతరం యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకృష్ణ, టూట  అధ్యక్షులు డాక్టర్ పున్నయ్య, యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకుల అధ్యక్షులు డాక్టర్ దత్తహరి, శ్రీనివాస్, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ బిఆర్ నేత, నాయకులు సాగర్ నాయక్, రాజేందర్, మహేష్, శ్రీకాంత్, మంద నవీన్,కుశ కుమార్,రాజు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love