స్పందన పాఠశాలలో ఘనంగా ఓనం పండగ వేడుకలు

నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: 8వ కాలనీలోని స్పందన మోడల్ స్కూల్ లో సోమవారం కేరళ ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వివిధ పూలతో అలంకరించిన ముగ్గు ముందు పండ్లు, బెల్లం, అటుకులు వంటి ప్రసాదాలను ముందుంచి కేరళ ఓనం పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు పిఎస్ సురజా పండగ విశిష్టతను పిల్లలకు వివరించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలోని కేరళ విద్యార్థులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్ రావు, ఉపాధ్యాయులు వనిత, పద్మ, మాధవి, అమల, అనూష, రిజ్వానా, ఫర్జానా, అరుణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love