బీఆర్ఎస్ ఎంపీ కవిత గెలుపే మన ముందున్న లక్ష్యం

– బడే నాగజ్యోతి జిల్లా పరిషత్ ఛైర్మన్ ములుగు
నవతెలంగాణ – గోవిందరావుపేట
బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా అందరము కృషి చేయాలని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ మండల కన్వీనర్ లాకావత్ నరసింహ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా  మాట్లాడుతూ ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా ఇన్చార్జ్ బడే నాగజ్యోతి గారు మాట్లాడుతూ..అందరూ కారు గుర్తుపై ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ మాలోత్ కవిత ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుదం. మేలు చేసేవారికి ఓటు వేస్తేనే మన బతుకులు, మన పిల్లల బతుకులు మారుతాయి. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.మాట చెప్పి నిలబెట్టుకున్న వారిని గెలిపించుకుందామా లేక మాటలు చెప్పి మోసం చేసిన వారిని గెలిపిద్దామా ?? ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అని వారు పిలుపునిచ్చారు.
ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గారు మాట్లాడుతూ..
కేసీఆర్  ముఖ్యమంత్రి అయ్యాక రైతుబంధు ఇస్తానని ఇచ్చిండు, పెన్షన్ మొదట రూ. 1000 తరువాత రూ. 2000 చేసిండు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి రూ. లక్షా నూటపదహార్లు ఇచ్చిండు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చారు.24 గంటల కరంటు సరఫరా చేసినం, బతుకమ్మ పండుగకు ఆడబిడ్డకు చీరలు ఇచ్చినం. రంజాన్ పండుగకు ముస్లిం లకు, క్రిస్మస్ పండగకు క్రిస్టియన్ లకు బట్టలు పంపిణీ చేశాం.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు.రైతుబంధు ఎకరాకు రూ. 15,000, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. ఇందులో ఏది కూడా అమలు చేయడం లేదు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలి.మహిళలు నెత్తిన బిందే పెట్టుకుని మోయకూడదనే ఉద్యేశంతో మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే, ఇప్పుడు త్రాగునీరు సరఫరా చేయలేక పోతున్నారు.మళ్ళీ మహిళలు బిందెలు మోసే పరిస్థితి నెలకొంది.పంటలు వేసిన తరువాత ఎంక్వైరీ చేసి రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. రైతుబంధు అనేది పంట పెట్టుబడి కోసం ఇచ్చేది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు, అధికారం కావాలి. ప్రజల కష్టాలు అవసరం లేదు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువకులను మోసం చేసిండు. ప్రజలారా బిజెపి కి ఓటు వేసి ఇంకోసారి మోసపోకండి. ములుగు నియోజకవర్గం నుండి నాకు  భారీ మెజారిటీ ఇవ్వాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ బాబు  మాజీ గ్రంథాలయం చైర్మన్ పో రిక గోవింద నాయక్  ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి  జడ్పిటిసి తుమ్మల హరిబాబు  రైతు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి ఎంపిటిసి ఆలూరి శ్రీనివాసరావు వెలిశాల స్వరూప కోపరేట్ బ్యాంకు సూది రెడ్డి లక్ష్మణ్ రెడ్డి లకావత్ చందులాల్ సీనియర్ నాయకులు డాక్టర్ హేమాద్రి చల్వాయి మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య  రేగూరి రవీందర్ రెడ్డి పృధ్విరాజ్ ఊట్ల అధికార ప్రతినిధి బూరెటి మధు మండల ఉపాధ్యక్షులు చుక్కగట్టయ్య  గోవిందరావుపేట ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు అజ్మీర సురేష్   ఉట్ల మోహన్ గోవిందపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్ గారు చల్వాయి నాం పూర్ణచందర్ పసర తాటికొండ శ్రీనివాస చారి గోవిందరావుపేట మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి రుద్రబోయిన మల్లేష్ దేవా నాయక్ శ్రీనివాస్ Pస్వామి  బండి రాజశేఖర్ తిరుపతి జి శ్రీనివాస్ జి ప్రకాష్ జన్ను సుధాకర్ కరుణాకర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Spread the love