ఒక్కో డాట్‌ బాల్‌కు

500 మొక్కలు : బీసీసీఐ
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-16లో భాగంగా బీసీసీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకరం చుట్టింది. 2023 ప్లే ఆఫ్స్‌ మ్యాచుల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌ బాల్‌కు 500ల మొక్కల చొప్పున నాటాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచుల్లోనూ నమోదయ్యే డాట్‌ బాల్స్‌ లెక్కల ప్రకారం బీసీసీఐ మొక్కలు నాటనుంది. పర్యావరణ పరిరక్షణను బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టీం.. 34 డాట్‌ బాల్స్‌, చెన్నై 38 డాట్‌ బాల్స్‌ వేశారు. ఈ లెక్కల ప్రకారం బీసీసీఐ 36 వేల మొక్కలు నాటనుంది. బుధవారం జరిగే లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబయి మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌, శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2, ఆదివారం జరిగే ఫైనల్లో వేసే డాట్‌ బాల్స్‌నూ బీసీసీఐ పరిగణనలోకి తీసుకోనుంది

Spread the love