పశువుల్లో వచ్చే గర్భ కోశ వ్యాధులను నివారించాలి

నవతెలంగాణ – తుర్కపల్లి
పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులు, సీజనల్ లో వచ్చే వ్యాధులను గుర్తించి నివారించాలని పశుసంవర్ధక శాఖ, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ సదానందం అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ, నోవార్టీస్ అగ్రో ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల్లో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఉచిత పశు వైద్య శిబిరంలో 27 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 224 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కె శ్రీనివాసరావు ,డాక్టర్ ఎల్ జనార్ధన్, పశువైద్య సిబ్బంది ఎన్ రాఘవేందర్, ఎండి శంషాద్దీన్, పెండెం ప్రవీణ్, కే ప్రవీణ్, నోవార్టీస్ సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గజేంద్ర, సీనియర్ ఇంజనీర్ సెంథిల్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love