ప్రజాపాలన దరఖాస్తు ఫారం..సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ ఉండనుంది. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల దరఖాస్తు ను లాంచ్ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ తరుణంలోనే.. తన నివాసం నుంచి విమానాశ్రయానికి బయల్దేరారు సీఎం రేవంత్‌ రెడ్డి. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా విమానాశ్రయానికి బయల్దేరారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న తర్వాత సచివాలయం లో 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల దరఖాస్తు ను లాంచ్ చేయనున్నారు సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..మంత్రులు. ఢిల్లీ నుంచి రాగానే ప్రెస్ మీట్ ఉండనుంది. మంచు కారణంగా ఫ్లైట్ కాస్త లేట్ గా రానుందట. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ ఉండనుందని అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ సీఎంఓ.

Spread the love