పబ్లిక్‌ టాక్‌ అదుర్స్‌

హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ థ్రిల్లర్‌ ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి సీఈఓగా, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై కె రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, మంచి విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో నిఖిల్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి వరల్డ్‌ వైడ్‌ యునానిమస్‌గా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నా కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దర్శకుడు గ్యారీ సినిమాని చాలా కొత్తగా, రిచ్‌గా ప్రజెంట్‌ చేశారు. శ్రీచరణ్‌ నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు’ అని తెలిపారు. ‘పబ్లిక్‌ టాక్‌ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. కామెడీ, యాక్షన్‌ అన్ని ఎలిమెంట్స్‌ చక్కగా వర్క్‌ అవుట్‌ అయ్యాయి’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.

Spread the love